హైదరాబాద్: అక్టోబర్ వరకు వాహనాలు నడపొద్దని ఓ సిద్దాంతి మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణను హెచ్చరించాడు. కానీ, ఆయన మాత్రం ఆ సిద్దాంతి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కారు నడిపేందుకు నలుగురైదుగురు డ్రైవర్లు వచ్చినా కూడ వారికి డబ్బులిచ్చి పంపించేశాడని  ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మాజీ ఎంపీ, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ బుధవారం నాడు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో  మరణించాడు.  అయితే వాహానాలు నడపకూడదని   సిద్ధాంతి హరికృష్ణకు సూచించాడని ఆహ్వానం హోటల్ సిబ్బంది గుర్తు చేసుకొంటున్నారు.

అయితే  వాహానం డ్రైవ్ చేయకుండా మాత్రం  ఆయన ఉండలేదు. డ్రైవింగ్ అంటే  హరికృష్ణకు చాలా ఇష్టం. దీంతో హరికృష్ణ  మాత్రం డ్రైవింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. నెల్లూరు జిల్లా కావలిలో  జరిగే ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఇవాళ తెల్లవారుజామున హైద్రాబాద్ నుండి బయలుదేరారు. 

కారు డ్రైవింగ్  చేయకూడదని  సిద్ధాంతి  హరికృష్ణకు సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ మాసం వరకు  డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు. జ్యోతిష్యం , వాస్తు లాంటి విషయాలపై హరికృష్ణ ఎక్కువగా పట్టించుకొంటారు. 

అంతేకాదు కొన్ని సెంటిమెంట్లు, ముహుర్తాలకు కూడ ప్రాధాన్యత ఇస్తారు.కానీ సిద్ధాంతి ఇచ్చినా సూచనలను ఆయన ఎందుకు పాటించలేదోననే విషయమై అర్థం కాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

మరో వైపు ఆహ్వానం హోటల్‌లో వాస్తు మార్పులు కూడ చేయాలని సూచనలు కూడ వచ్చినా కూడ సమయం వచ్చినప్పుడు చేద్దామని ఆయన హెటల్ సిబ్బందికి చెప్పేవారని  వారు గుర్తు చేసుకొంటున్నారు.  

అయితే కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటించే  హరికృష్ణ ఈ విషయాన్ని ఎందుకు పాటించలేదో అర్థం కాలేదోనని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.ఇటీవల కాలంలో ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు పనిచేసేందుకు వచ్చినా కూడ వారిని హరికృష్ణ డబ్బులిచ్చి మరీ తిప్పి పంపించేసినట్టు ఆహ్వానం హోటల్ సిబ్బంది గుర్తు చేసుకొంటున్నారు.

ఈ వార్తలు చదవండి

హరికృష్ణ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోత్కుపల్లి

హిందూపురంతో హరికృష్ణ బంధం ఇదీ...

హరికృష్ణ: రోజులో ఎక్కువ టైమ్ 1001 రూమ్‌లోనే, ఎందుకంటే?

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు