సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయ్యింది. కామినేని ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌కు మృతదేహాన్ని తరలించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

కాగా.. హరికృష్ణ అంత్యక్రియలు రేపు శంషాబాద్ దగ్గరగల ఫాంహౌస్‌లో జరగనున్నాయి. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే హరికృష్ణ కుటుంబసభ్యులు, బంధువులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆస్పత్రి వద్ద కుమారులు ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌తో పాటు త్రివిక్ర‌మ్, జ‌గ‌ప‌తి బాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, నారా లోకేష్ , బాలకృష్ణ, పురందేశ్వరి త‌దిత‌రులు ఉన్నారు. 

హరికృష్ణ మృతి: కారు ప్రమాదం ఎలా జరిగింది?

హరికృష్ణ మృతి: కామినేని ఆసుపత్రికి చేరుకొన్న బాబు

హరికృష్ణ మృతి... చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆస్పత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి

వర్షాలకు పాడైన రోడ్డు...అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది : నల్గొండ ఎస్పీ

హరికృష్ణ కార్ యాక్సిడెంట్.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..