నల్గొండ: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రి వద్దకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు చేరుకొన్నారు. బాబు వెంట మంత్రి లోకేష్ కూడ ఉన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్ లు  హెలికాప్టర్‌లో అమరావతి నుండి నేరుగా నల్గొండకు చేరుకొన్నారు. అక్కడి నుండి ప్రత్యేక కాన్వాయ్ లో సీఎం చంద్రబాబునాయుడు కామినేని ఆసుపత్రికి చేరుకొన్నారు.

చంద్రబాబునాయుడు , లోకేష్ హరికృష్ణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన తర్వాత  మృతదేహాన్ని హైద్రాబాద్ తరలించనున్నారు. కామినేని ఆసుపత్రిలో  హరికృష్ణ మృతదేహనికి పోస్ట్ మార్టం కోసం ఏర్పాట్లు చేశారు.

హరికృష్ణ మృతదేహన్ని పోస్టు మార్టం పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ భవన్ లో ఉంచనున్నారు. ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నాయకులు నివాళులర్పించేలా పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ భవన్ లో నివాళుల తర్వాత హరికృష్ణ ఇంటికి పార్థీవదేహన్ని తీసుకెళ్లనున్నారు.