Asianet News TeluguAsianet News Telugu

కర్ఫ్యూలో వచ్చా, సామాన్యుడిగానే జీవిస్తా: నరసింహన్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానుగవర్నర్ గా ఎంతో నేర్చుకొన్నానని ఆయన చెప్పారు. 

governor narasimhan interesting comments on his tenure
Author
Hyderabad, First Published Sep 3, 2019, 5:37 PM IST


హైదరాబాద్:గవర్నర్ గా  తాను ఎంతో నేర్చుకొన్నానని నరసింహన్ చెప్పారు. తాను ఏనాడూ ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు

నరసింహన్ బదిలీ కావడంతో రాజ్‌భవన్ లో ప్రముఖులకు మంగళవారం నాడు నరసింహన్ మీడియాతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. . ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు తన మనసులోని భావాలను బయటపెట్టారు.

కర్ఫ్యూ సమయంలో  తాను ఈ గడ్డపై కాలు మోపినట్టుగా గవర్నర్ గుర్తు చేసుకొన్నారు. తాను గవర్నర్ గా వచ్చినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారని అంతా అనుకొన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో పోలీసులు చాలా సంయమనాన్ని పాటించారని ఆయన గుర్తు చేసుకొన్నారు.ఒక్క బుల్లెట్ కూడ ఉపయోగించొద్దని తాను పోలీసులకు చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు.తెలంగాణ  పోలీసులను గవర్నర్ నరసింహన్  అభినందించారు.

ఇతం కాలం పాటు  తనకు మీడియా ఎంతో సహకరించిందని ఆయన చెప్పారు.ఈ సహకారాన్ని తాను మరవలేనన్నారు. తనకు మీడియా బాగా సహకరించిందన్నారు. గుళ్లు, గోపురాలు తిరుగుతానని సెటైర్లు వేసినా కూడ తాను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుందన్నారు. తనకు ఆధ్యాత్మిక జీవితం ఉందని ఆయన చెప్పారు. మంచి జ్ఞాపకాలను తాను తీసుకెళ్తున్నట్టుగా ఆయన తెలిపారు.

2011 బడ్జెట్ ప్రసంగ సమయంలో ఏం జరిగినా కూడ తాను బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేయాలని భావించినట్టుగా ఆయన చెప్పారు.తాను సామాన్యుడిగా జీవనం గడుపుతానని నరసింహన్ చెప్పారు. చెన్నైలో స్థిరపడతానని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహన్ 9 ఏళ్ల 3 మాసాలు పనిచేశారు. తమిళనాడుకు చెందిన తమిళసై సౌందర రాజన్  ను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియ మిస్తూ ఈ నెల 1వ తేదీన రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

గవర్నర్ గా తమిళిసాయి: ఎన్టీఆర్, కుముద్ బెన్ జోషీ ఎపిసోడ్ రిపీట్?

నరసింహన్: ఆరుగురు సీఎంలు, 9 ఏళ్ల పాటు గవర్నర్ పదవిలోనే....

తమిళిసై టఫ్: కేసీఆర్ ను కలవరపెట్టడానికే బిజెపి ప్లాన్

నరసింహన్‌‌తో రెండు గంటల చర్చలు: కేసీఆర్ ప్లాన్ ఇదీ

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌‌గా నియామకం: స్పందించిన దత్తాత్రేయ

విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

దత్తాత్రేయకు బీజేపీ కార్యకర్తల అభినందనలు (ఫోటోలు)

Follow Us:
Download App:
  • android
  • ios