తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ అయినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయమై నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.

governor narasimhan transfer

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను బదిలీ చేసినట్టు సమాచారం. బదిలీ ఉత్తర్వులు నేడో రేపోవెలువడే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
కొత్త గవర్నర్ ను ఎవరిని నియమిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి గవర్నర్ గా కూడ నరసింహన్ రికార్డు సృష్టించారు. ఇటీవలనే ఏపీ రాష్ట్రానికి బిశ్వభూషణ్ హరిచందన్ ను కేంద్రం నియమించింది.

తాజాగా తెలంగాణ గవర్నర్ గా నరసింహాన్ ను బదిలీ చేసినట్టుగా సమాచారం ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి నరసింహాన్ తొమ్మిదేళ్ల 9 నెలల పాటు గవర్నర్ గా కొనసాగారు.తెలంగాణ సీఎం కేసీఆర్ తో గవర్నర్ కు సన్నిహిత సంబంధాలు ఉండడం వంటి పరిణామాలతో పాటు సుధీర్ఘ కాలం పాటు ఈ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న నరసింహాన్ ను బదిలీ చేసినట్టుగా చెబుతున్నారు.

యూపీఏ హాయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహాన్ నియమితులయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గవర్నర్ కీలకంగా వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నరసింహాన్ పనిచేశాడు. ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు కూడ. ఈ రాష్ట్రంలో పట్టుందని భావించిన కేంద్రం ఆనాడు ఆయనను గవర్నర్ గా నియమించింది.

రాష్ట్ర విభజన తర్వాత కూడ రెండు రాష్ట్రాలకు కూడ ఆయననే గవర్నర్ గా కొనసాగించింది. ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ నరసింహన్ ను కొనసాగించింది.నరసింహన్ స్థానంలో ఎవరిని నియమిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. తమిళనాడుకు చెందిన వ్యక్తినే గవర్నర్ గా నియమించే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios