హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్  సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. వారిలో ఐదుగురితో నరసింహన్ ప్రమాణం చేయించారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్‌తో ప్రమాణం చేయించిన తర్వాత నరసింహన్ ఏపీ రాష్ట్రానికి బదిలీపై వచ్చారు.

నరసింహన్ ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చారు.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో  ఆయన రాష్ట్రానికి గవర్నర్ గా వచ్చారు. 2009 డిసెంబర్ 28వ తేదీన ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ఆయన గవర్నర్ గా  బాధత్యలు స్వీకరించారు.

ఆనాడు తెలంగాణ ఉద్యమంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలతో  ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యను కాంగ్రెస్ పార్టీ తప్పించింది. కిరణ్ కుమార్ రెడ్డిని  ముఖ్యమంత్రిగా నియమించింది. 2010 నవంబర్ లో కిరణ్ కుమార్ రెడ్డితో సీఎంగా గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో  యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, అప్పటి కేంద్రమంత్రులు సుశీల్‌కుమార్ షిండే, చిదంబరంలతో నరసింహన్ తరచూ సమావేశాలు నిర్వహిస్తుండేవాడు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు గవర్నర్ నరసింహన్ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆ సమయంలో తెలంగాణ వాదులు ఆరోపణలు చేశారు.

2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది.తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ చాలా సఖ్యతతో ఉండేవారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన  తర్వాత కూడ ఇదే పంథాను కేసీఆర్ కొనసాగించారు.

కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలను గవర్నర్  ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సమయంలో గవర్నర్ నరసింహన్ అప్పటి  భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావును కాళేశ్వరరావుగా పిలిచారు.కేసీఆర్ ను కూడ ఆయన అభినందించారు. 

ఇటీవల తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన మున్సిఫల్ ఆర్డినెన్స్ ను ఆయన వెనక్కు పంపారు. ఈ విషయమై విపక్షాలు గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సౌందర రాజన్ ను నియమిస్తూ ఆదివారం నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.సౌందర రాజన్ త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారు.నరసింహన్ ను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.నరసింహన్  తన బాధ్యతల నుండి తప్పుకొన్న తర్వాత  కీలకమైన పదవిని అప్పగించాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టుగాప్రచారం సాగుతోంది. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి గవర్నర్ గా రాకముందు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఆయన పనిచేశారు.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి ఆయన మూడేళ్ల పాటు గవర్నర్ గా పనిచేశారు.

 

సంబంధిత వార్తలు

తమిళిసై టఫ్: కేసీఆర్ ను కలవరపెట్టడానికే బిజెపి ప్లాన్

నరసింహన్‌‌తో రెండు గంటల చర్చలు: కేసీఆర్ ప్లాన్ ఇదీ

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌‌గా నియామకం: స్పందించిన దత్తాత్రేయ

విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం

తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?

నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న

ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి

దత్తాత్రేయకు బీజేపీ కార్యకర్తల అభినందనలు (ఫోటోలు)