గండ్ర ఫిర్యాదు: విజయలక్ష్మిపై బంజారాహిల్స్‌ స్టేషన్‌లో కేసు

Gandra Venkataramanareddy complaint agaisnt vijalaxmi reddy in Banjarahills police
Highlights

 తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని  విజయలక్ష్మి రెడ్డిపై  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత  గండ్ర వెంకటరమణారెడ్డి  బంజారాహిల్స్ పోలీసులకు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. 
 


హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని  విజయలక్ష్మి రెడ్డిపై  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత  గండ్ర వెంకటరమణారెడ్డి  బంజారాహిల్స్ పోలీసులకు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. 

నాలుగేళ్లుగా  తనకు గండ్ర వెంకటరమణారెడ్డితో సాన్నిహిత్యం ఉందని విజయలక్ష్మిరెడ్డి ఆరోపించారు.ఈ విషయమై ఆమె  జీఎంఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. 

దీంతో  తనపై తప్పుడు ఆరోపణలు చేయడంపై  గండ్ర మండిపడ్డారు.ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు ఆరోపణలతో తనను వేధింపులకు గురిచేస్తోందని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ విషయమై  బంజారాహిల్స్ పోలీసులకు గండ్ర వెంకటరమణారెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆదివారం నాడు  హన్మకొండలోని గండ్ర ఇంటి ఎదుట విజయలక్ష్మిరెడ్డి ధర్నా నిర్వహించారు. కాల్‌డేటాను బయట పెడితే  తమ మధ్య ఉన్న బంధం బయటకు వస్తోందని విజయలక్ష్మి చెప్పారు. 

రాజకీయంగా తనను ఇబ్బందులు పెట్టేందుకే విజయలక్ష్మి రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తోందని  గండ్ర వెంకటరమణారెడ్డి  ఆరోపిస్తున్నారు.విజయలక్ష్మిపై  బంజారాహిల్స్ పోలీసులకు  సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.  ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు.

ఈ వార్తలు చదవండి:నన్ను వాడుకొని వదిలేశాడు: గండ్రపై మహిళ ఆరోపణ
                                   
మా ఆయన మంచోడు: విజయలక్ష్మి ఆరోపణలపై గండ్ర భార్య ఆవేదన

                                    సీసీటీవీ పుటేజీలు చూస్తే తెలుస్తుంది: తనతో గండ్ర లింక్స్‌పై విజయలక్ష్మి

 

loader