మా ఆయన మంచోడు: విజయలక్ష్మి ఆరోపణలపై గండ్ర భార్య ఆవేదన

Gandra jyothi reacts on Vijayalaxmi reddy comments
Highlights

నా భర్త ఎలాంటి వాడో తనకు తెలుసునని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి భార్య  గండ్ర జ్యోతి  చెప్పారు. తన భర్తపై విజయలక్ష్మిరెడ్డి చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.


హైదరాబాద్: నా భర్త ఎలాంటి వాడో తనకు తెలుసునని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి భార్య  గండ్ర జ్యోతి  చెప్పారు. తన భర్తపై విజయలక్ష్మిరెడ్డి చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.

సోమవారం నాడు ఆమె హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు తమ వివాహామై 33 ఏళ్లు అవుతోందన్నారు.ఇన్నేళ్ల తమ కాపురంలో తన భర్త గురించి  ఏనాడు కూడ తాను తప్పుగా  వినలేదని, చూడలేదన్నారు.  రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైందికాదన్నారు.

రాజకీయాల్లో ఉన్నవారికి రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకంగా నీచపు  ఆరోపణలు చేయడం సరైందికాదన్నారు.  ఈ రకమైన దుష్ప్రచారంతో  రెండు రోజులుగా తమ కుటుంబం తీవ్రంగా మానసిక క్షోభను అనుభవిస్తున్నట్టు ఆమె చెప్పారు.

తన భర్త, తాను, పిల్లలు రెండు రోజులుగా  తీవ్రంగా క్షోభెకు గురైతున్నామని  ఆమె తెలిపారు. విజయలక్ష్మిరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.  తన భర్త గురించి తనకు తెలుసునని ఆమె చెప్పారు.  

ఈ వార్త చదవండి:నన్ను వాడుకొని వదిలేశాడు: గండ్రపై మహిళ ఆరోపణ


 

loader