సీసీటీవీ పుటేజీలు చూస్తే తెలుస్తుంది: తనతో గండ్ర లింక్స్‌పై విజయలక్ష్మి

Vijayalaxmi reddy reacts on gandra jyothi comments
Highlights

గండ్ర వెంకటరమణారెడ్డి కాల్‌డేటాను బయటపెడితే  తనకు  ఆయనకు మధ్య ఉన్న బంధం తేట తెల్లమౌతోందని  విజయలక్ష్మిరెడ్డి చెప్పారు. తన ఫోన్లను  ఇప్పిస్తే  గండ్ర వెంకటరమణారెడ్డితో  తనకు ఉన్న బంధాన్ని  ఐదు నిమిషాల్లో  తేలుస్తానని ఆమె చెప్పారు

 గండ్ర వెంకటరమణారెడ్డి కాల్‌డేటాను బయటపెడితే  తనకు  ఆయనకు మధ్య ఉన్న బంధం తేట తెల్లమౌతోందని  విజయలక్ష్మిరెడ్డి చెప్పారు. తన ఫోన్లను  ఇప్పిస్తే  గండ్ర వెంకటరమణారెడ్డితో  తనకు ఉన్న బంధాన్ని  ఐదు నిమిషాల్లో  తేలుస్తానని ఆమె చెప్పారు. సీసీకెమెరాల పుటేజీలను పరిశీలిస్తే వెంకటరమణారెడ్డి చెబుతున్న మాటల్లో నిజమెంతో తేలుతోందన్నారు.

నాలుగేళ్లుగా తనతో గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధం ఉందని విజయలక్ష్మిరెడ్డి అనే మహిళ హన్మకొండ జీఎంఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. 

గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి  వ్యాఖ్యలపై  విజయలక్ష్మి రెడ్డి స్పందించారు.  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో ఆమె ఈ విషయమై మాట్లాడారు. తనకు నాలుగేళ్లుగా గండ్ర వెంకటరమణారెడ్డితో సంబంధం ఉందన్నారు.  స్వచ్ఛంధ సంస్థ నిర్వహిస్తున్న తనకు వెంకటరమణారెడ్డితో ఏర్పడిన పరిచయం మరింత సాన్నిహిత్యాన్ని పెంచిందని ఆమె చెప్పారు.

నాలుగేళ్లుగా తనను వెంకటరమణారెడ్డి వాడుకొన్నాడని ఆమె ఆరోపించింది. వెంకటరమణారెడ్డి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో తనకు తెలుసునని చెప్పారు. వెంకటరమణారెడ్డి  ఇంటి వద్ద ఉన్న సీసీ పుటేజీ  వివరాలను పరిశీలిస్తే  అన్నీ విషయాలు వెలుగు చూస్తాయన్నారు. ప్రతి రోజూ తనతో వెంకటరమణారెడ్డి మాట్లాడేవాడని  ఆమె చెప్పారు. 

తన రెండు ఫోన్లలో వెంకటరమణారెడ్డి తనతో ఏం మాట్లాడాడో  రికార్డింగ్ చేసినట్టు ఆమె చెప్పారు.ఈ ఫోన్లను తనకు ఇప్పిస్తే  ఐదు నిమిషాల్లో  వెంకటరమణారెడ్డి చెప్పేది వాస్తవమా, నేను చెప్పేది వాస్తవమా తేలనుందన్నారు. నేను ఎవరో తెలియదని చెబుతున్న వెంకటరమణరెడ్డి ప్రతి రోజూ ఎందుకు తనతో ఫోన్లో మాట్లాడో చెప్పాలని ఆమె ప్రశ్నించింది.

తన వెనుక అధికారపార్టీకి చెందిన నేతలు ఉన్నారని గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించడాన్ని ఆమె తప్పుబట్టారు.ఈ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు నా కాల్ డేటాను తీస్తే  ఎవరితో ఎవరు మాట్లాడారో తేలుతుందన్నారు.

హన్మకొండలో తన భార్య జ్యోతి ఉండదని  తనకు  వెంకటరమణారెడ్డి చెప్పారని విజయలక్ష్మిరెడ్డి చెప్పారు.  అయితే ఇప్పుడు మాత్రం  తాను ఎవరో తెలియదని తనను  దూరం పెడుతున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.  తనకు తన ఫోన్లను ఇప్పించాలని లేకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొంటానని చెప్పారు.

ఈ వార్త చదవండి.మా ఆయన మంచోడు: విజయలక్ష్మి ఆరోపణలపై గండ్ర భార్య ఆవేదన

                             నన్ను వాడుకొని వదిలేశాడు: గండ్రపై మహిళ ఆరోపణ


 

loader