ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలని కోరితే  తాను పోటీ చేసే విషయాన్ని ఆలోచిస్తానని ప్రజా యుద్దనౌక గద్దర్ చెప్పారు.


కామారెడ్డి: ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలని కోరితే తాను పోటీ చేసే విషయాన్ని ఆలోచిస్తానని ప్రజా యుద్దనౌక గద్దర్ చెప్పారు. తాను పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాల ఓట్ల చీలిక వచ్చే అవకాశం ఉంటే తాను పోటీ చేయబోనని చెప్పారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఓట్ల విప్లవం వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉందన్నారు. కానీ, కేసీఆర్‌ను కలిసే అవకాశం మాత్రం లేదన్నారు. 

తాను ఏ పార్టీకి సభ్యుడిని కానని చెప్పారు. పల్లె పల్లెకు పాటనై వస్తున్నానని గద్దర్ చెప్పారు. వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో గద్దర్ భేటీ అయ్యారు. గజ్వేల్ నుండి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను బరిలోకి దింపాలని భావిస్తున్నారనే ప్రచారం ఉంది. విపక్షాల మధ్య ఓట్ల చీలిక రాకుండా ఉంటేనే తాను పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

రాహుల్ గాంధీ కోరిందేమిటి: గద్దర్ వ్యూహం ఏమిటి?

రాహుల్ గాంధీతో భేటీ మతలబు: ఎవరీ గద్దర్?

గజ్వేల్: కేసీఆర్‌పై పోటీకి దిగేదీ గద్దరా, ప్రతాప్ రెడ్డియా?