Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ కోరిందేమిటి: గద్దర్ వ్యూహం ఏమిటి?

మధు యాష్కీ గౌడ్ తో కలిసి గద్దర్ కుటుంబ సభ్యులు శుక్రవారం రాహుల్ గాంధీని కలిశారు. అయితే, పార్టీలో చేరాల్సిందిగా రాహుల్ గాంధీ గద్దర్ ను కోరినట్లు సమాచారం. ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన గద్దర్ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పారు. 

gaddar strategy: What Rahul wants?
Author
New Delhi, First Published Oct 13, 2018, 9:00 AM IST

హైదరాబాద్:  ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రజా గాయకుడు గద్దర్ కలవడం వెనక పకడ్బందీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు దూరంగా ఉన్న శక్తులను కలుపుకుని వెళ్లాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగానే ఆయన గద్దర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇందులో పార్టీ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ కీలక పాత్ర పోషించారు. మధు యాష్కీ గౌడ్ తో కలిసి గద్దర్ కుటుంబ సభ్యులు శుక్రవారం రాహుల్ గాంధీని కలిశారు. అయితే, పార్టీలో చేరాల్సిందిగా రాహుల్ గాంధీ గద్దర్ ను కోరినట్లు సమాచారం. ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన గద్దర్ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పారు. 

గజ్వెల్ లో కేసిఆర్ పై గానీ, మరో సీటులో గానీ తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గద్దర్ రాహుల్ గాంధీతో చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, అందుకు మహా కూటమి నేతలను ఒప్పించాలని గద్దర్ రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది.

అదే సమయంలో కాంగ్రెసులో ఉన్న తన కుమారుడు సూర్య కిరణ్ కు బెల్లంపల్లి టికెట్ ఇవ్వాలని కూడా గద్దర్ రాహుల్ గాంధీని కోరినట్లు తెలుస్తోంది. సిపిఐని ఒప్పించడానికి తాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో మాట్లాడుతానని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

గజ్వెల్ లో కేసిఆర్ పై తెలుగుదేశం పార్టీ నేత వంటేరు ప్రతాప రెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గజ్వెల్ లో ఆయన కేసిఆర్ కు గట్టి పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. దీనివల్ల గద్దర్ కు వేరే సీటు కేటాయించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ స్థితిలో గద్దర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమైందని అంటున్నారు. 

సంబంధిత వార్త

రాహుల్ గాంధీతో భేటీ మతలబు: ఎవరీ గద్దర్?

Follow Us:
Download App:
  • android
  • ios