చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితుల మధ్య అక్రమ సంబంధం చిచ్చుపెట్టడమే కాకుండా స్నేహితుడిని అత్యంత క్రూరంగా చంపేలా చేసింది. లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీకి చెందిన సయ్యద్ ఇమ్రాన్, గౌసాహి మసీదు ప్రాంతానికి చెందిన షబ్బీర్ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు.

వీరు క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. షబ్బీర్‌కు రెండున్నరేళ్ల క్రితం వివాహం జరగ్గా.. ఇమ్రాన్‌కు రెండు నెలల క్రితం పెళ్లి జరిగింది. స్నేహితులు కావడంతో తరచూ ఒకరి ఇంటికి ఒకరు రాకపోకలు సాగిస్తూ ఉండేవారు.

ఈ క్రమంలో ఇమ్రాన్‌, షబ్బీర్ భార్యతో చనువుగా ఉండేవాడు.. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో.. షబ్బీర్ లేని సమయంలో ఇంటికి వచ్చి అతని భార్యతో గడిపి వెళ్లేవాడు. గత నెల 24న దీనిని గమనించిన మరో స్నేహితుడు షబ్బీర్‌కు తెలియజేశాడు.

దీంతో రెండు రోజుల క్రితం భార్యను పుట్టింటికి పంపించిన షబ్బీర్ సోమవారం మధ్యాహ్నం ఇమ్రాన్‌ను ఇంటికి పిలిపించాడు. తన భార్యతో వివాహేతర సంబంధంపై ప్రశ్నించగా గొడవకావడంతో ఇమ్రాన్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.

అయినప్పటికీ కొబ్బరి బొండాల కత్తితో షబ్బీర్ అతడిని వెంబడించి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపాడు. వీరి మధ్య డబ్బు విషయంలోనూ గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 

డీఎస్పీ అక్రమ సంబంధం: పక్కోడి పెళ్లాన్ని, భూమిని కూడా లాక్కొన్నాడు

అక్రమ సంబంధం....నడిరోడ్డుపై దారుణ హత్య

భర్తకు ఎయిడ్స్ సోకిందని... బంధువుతో భార్య అక్రమ సంబంధం

మోడల్ తో అక్రమ సంబంధం..భార్యను అడ్డు తప్పించేందుకు

వివాహితతో అక్రమ సంబంధం.. నీలదీసిన భార్యను..

ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య

ధనవంతుడి అక్రమ సంబంధం.. రక్షిస్తామని.. రూ.4 కోట్లు వసూలు చేసిన పోలీసులు

వదినతో అక్రమ సంబంధం.. చివరికిలా...

దెయ్యం పేరుతో భర్త కళ్లుగప్పి.. నవవధువు అక్రమ సంబంధం

భార్యతో వృద్థుడి అక్రమ సంబంధం.. చంపి ‘‘దృశ్యం’’ కథ చెప్పిన భర్త