దెయ్యం పేరుతో భర్త కళ్లుగప్పి.. నవవధువు అక్రమ సంబంధం

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 10, Aug 2018, 11:48 AM IST
bride sexual affair with boy friend husband complaints the police
Highlights

నవ వధువు.. భర్త కళ్లుగప్పి.. మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా గడవలేదు. అప్పుడే నవ వధువు.. భర్త కళ్లుగప్పి.. మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం ఓ యువకుడు.. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని స్వస్థలం నాగర్ కర్నూల్ కాగా.. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.

నాలుగునెలల కిందట అతినికి వివాహమైంది. వివాహం అనంతరం కొత్త భార్యతో కలిసి నగరంలో ఓ గదిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. అయితే వివాహం అయినప్పటి నుంచి అతడి భార్య దయ్యం పట్టిన దానిలా ప్రవర్తించింది. భూత వైద్యం చేయిస్తున్నాడు.

కాగా.. ఈ నెల 5 న బస్తీలో బోనాలు జరుగుతుండగా ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. ఆమె ఫోన్‌ నెంబర్‌ ట్రేస్‌ చేయగా బస్తీకి చెందిన గణేష్‌రెడ్డి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెలిసింది. దీంతో అతడిపై చట్టరిత్యా చర్యలు తీసుకొని తన భార్యను అప్పగించాలని భర్త బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గణేష్‌రెడ్డి పై 497 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader