ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిన్న జరిగిన టీఆర్ఎస్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారంనాడు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన వేదిక చేరుకుని పైకి ఎక్కే సమయంలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది.

ప్రధాన వేదికను ఎక్కబోతున్న అశ్వారావుపేట తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును వేదిక ఎక్కకుండా కేసీఆర్ అడ్డుకున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర కీలకనేతలను వేదికపైకి పంపిన కేసీఆర్.. తాటిని మాత్రం పక్కకు నెట్టివేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామంతో తాటి వెంకటేశ్వర్లు ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్లిపోయారు.

కేసీఆర్ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు పోస్టు అవుతున్నాయి. అయితే ఇది ప్రస్తుత ఎన్నికల ప్రచార సభా లేదంటే గతంలో కేసీఆర్ పర్యటన సందర్భంగా తీసిన వీడియోనా అంటూ చర్చ మొదలైంది.

"