హైదరాబాద్: ఐటీ గ్రిడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగులను సోమవారం నాడు జడ్జి ఎదుట సైబరాబాద్ పోలీసులు హాజరుపర్చారు.ఆదివారం నాడు హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నాడు పోలీసులు హాజరుపర్చారు.

తమ సంస్థలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులైన  భాస్కర్, ఫణి, చంద్రశేఖర్ విక్రమ్‌లు కన్పించడం లేదని ఐటీ గ్రిడ్ కంపెనీకి యాజమాని ఆశోక్ ఆదివారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన జడ్జి సోమవారం నాడు నలుగురు ఉద్యోగులను తన ముందు హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

సోమవారం నాడు సైబరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న నలుగురు ఉద్యోగులను కుందన్ బాగ్‌లోని హైకోర్టు జడ్జి ఎదుట సైబరాబాద్ పోలీసులు హాజరుపర్చారు. ఇదిలా ఉంటే ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల సమాచారాన్ని సేకరించిందని లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సైబారాబాద్ పోలీసులు ఈ కేసును  విచారిస్తున్నారు.తమ విచారణలో తేలిన అంశాలను కూడ సైబారాబాద్ పోలీసులు జడ్జికి వివరించనున్నారు.

సంబంధిత వార్తలు

టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు