తొలిసారి ఒకే వేదికపై ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ప్రధాని మోడీతో కలిసి అధికారికంగా ప్రధాని మోడీతో వేదికను పంచుకోబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు ఈ పరిమాణం కనిపించనుంది.
ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం ఆదిలాబాద్ కు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చాలా కాలం తరువాత ప్రధాని తెలంగాణలో చేస్తున్న ఈ పర్యటన చుట్టూ కొన్ని ఆసక్తికర అంశాలు ముడిపడి ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తరువాత ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన రెండో ప్రధాన మంత్రిగా మోడీ నిలవనున్నారు.
హిమాచల్ లో భారీ హిమపాతం.. చీనాబ్ నది ప్రవాహానికి అంతరాయం.. 650 రోడ్లు క్లోజ్
దాదాపు 40 ఏళ్ల తరువాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి భారత ప్రధాని వస్తున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1984లో ఆదిలాబాద్ ను సందర్శించారు. ఆ సమయంలో జిల్లాలో నక్సైలైట్ల ప్రాభల్యం ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ ఆమె ధైర్యంగా జిల్లాకు వచ్చి బహిరంగ సభలో ప్రసగించారని స్థానిక ప్రజలు చెప్పుకుంటారు.
చాలా కాలం తరువాత ప్రధాని మోడీ ఆదిలాబాద్ కు వస్తుండటంతో జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రధాని రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 జిల్లాల నుంచి 1600 మంది పోలీసులు ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఇంటిలిజెన్స్ అధికారులు, కేంద్ర అధికారులు, జిల్లా పోలీసులు అప్రమత్తంగా పని చేస్తున్నారు. దాదాపు వారం రోజులుగా జిల్లాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ప్రధాని మోడీ అంటే అభిమానం.. రక్తంతో చిత్రపటం గీసిన ఆదిలాబాద్ మహిళ..
కాగా.. ప్రధాని తాజా పర్యటనకు మరో ప్రధాన్యత ఉంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా అధికారికంగా ప్రధానితో ఒకే వేదికను పంచుకోనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు, పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు ఆయన కూడా నేడు ఆదిలాబాద్ చేరుకున్నారు. గవర్నర్ తమిళ సై కూడా పట్ణణానికి రానున్నారు. అయితే ఇప్పటికే పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క పరిశీలించారు.
నరేంద్ర మోడీ హిందువు కాదు - లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో రూ.56 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఆయన తమిళనాడు వెళ్లి సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకుటారు. ఈ నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ వెళ్లే మార్గంలో మార్చి 4న రాత్రి 7.40 గంటల నుంచి రాత్రి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.