నరేంద్ర మోడీ హిందువు కాదు - లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ హిందువు కాదని ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ లో ఎంతో గొప్ప మంది జన్మించారని చెప్పారు. తమ రాష్ట్ర అభిప్రాయానికి ఎంతో శక్తి ఉందని తెలిపారు.

Narendra Modi is not a Hindu -  Lalu Prasad Yadav's sensational comments..ISR

ప్రధాని నరంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన విమర్శలు చేశారు. నరేంద్ర మోడీ హిందువు కాదని, తల్లి మరణం తర్వాత తల, గడ్డం షేవ్ చేసుకోలేదని అన్నారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఆర్జేడీ నిర్వహించిన 'జన్ విశ్వాస్ ర్యాలీ'లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి ప్రధాని మోడీ రూ.2,000 విరాళం.. దేశ నిర్మాణానికి అందరూ భాగస్వాములవ్వాలని పిలుపు..

‘బీహార్ ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఇచ్చింది. ఇదే గాంధీ మైదానంలో దేశాధినేతలు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి నుంచి దేశం మొత్తానికి ఓ సందేశం వెళ్లింది. బీహార్ అభిప్రాయానికి ఎంతో శక్తి ఉంది. బీహార్ నిర్ణయించేది దేశ ప్రజలు అనుకరిస్తారు. రేపు కూడా అదే జరగబోతోంది.’ అని లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముడి వివాహం బీహార్ లోని జనక్ పూర్ లో జరిగిందని ఆయన అన్నారు. బీహార్ లో ఎందరో ధైర్యవంతులు జన్మించారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ భారత్ లో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన లాలూ ఆరోపించారు.

అనంతరం మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్ పై మండిపడ్డారు. జేడీయూ అధినేత పదేపదే యూటర్న్ తీసుకునే ప్రమాదం ఉన్నందున బీహార్ ప్రభుత్వం బీమా చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు ‘మోడీ కీ గ్యారంటీ’ అంటున్నారని, మరి నితీష్ కుమార్ హామీని ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.

తమది బంధుప్రీతి పార్టీ అని విమర్శిస్తారని, కానీ రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు సామ్రాట్ చౌదరి, మాంఝీ కుమారుడికి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఇది వారికి బంధుప్రీతిలా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ ఎక్కడున్న సంతోషంగా ఉండాలని అన్నారు. ‘‘మా మేనమామ (నితీష్ కుమార్) నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఆయన పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని హఆమీ ఇచ్చారు. వాటిని ఎక్కడి నుంచి తెస్తారు. ? మా హయాంలో కుల గణన చేశాం. రిజర్వేషన్ ల పరిమితిని 75 శాతానికి పెంచాం. అత్యంత వెనుకబడిన వారికి రిజర్వేషన్ పరిమితిని 24 శాతానికి పెంచాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో జరగని పనిని బీహార్ లో చేశాం’’ అని తేజస్వీ యాదవ్ అన్నారు. 

ఐపీఎల్ 2024... స్టార్ ఆటగాళ్లతో ప్రోమో వీడియో రిలీజ్.. వైరల్

బీజేపీ రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తోందని, కానీ ప్రజలను ఎలా కొంటారని తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. ప్రజలు స్పందిస్తారని అన్నారు. మోడీ ముందు కొందరు మోకాళ్లపై నమస్కరించారని, కానీ తన  నాన్నను చూసి గర్వపడుతున్నానని తెలిపారు. ఆయన చాలాసార్లు పోరాడారని, కానీ ఎప్పుడూ తలవంచలేదని చెప్పారు. లాలూ భయపడనప్పుడు ఆయన కుమారుడు భయపడతాడా అంటూ ధీమా వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios