ప్రధాని మోడీ అంటే అభిమానం.. రక్తంతో చిత్రపటం గీసిన ఆదిలాబాద్ మహిళ..

ఆదిలాబాద్ కు చెందిన మహిళ ప్రధాని నరేంద్ర మోడీ పై అభిమానాన్ని కొత్తగా చాటుకున్నారు. తన రక్తంతో ప్రధాని చిత్రపటాన్ని గీయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Adilabad woman paints portrait of PM Modi with blood..ISR

ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కు రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన స్వప్న అనే మహిళ ప్రధాని మోడీపై తన అభిమానాన్ని కొత్తగా చాటుకున్నారు. ప్రధానికి పెద్ద అభిమాని అయిన ఆమె.. తన రక్తంతో మోడీ చిత్రపటాన్ని గీయించారు. 

హిమాచల్ లో భారీ హిమపాతం.. చీనాబ్ నది ప్రవాహానికి అంతరాయం.. 650 రోడ్లు క్లోజ్

స్వప్నకు ప్రధాని మోడీ ఎంతో అభిమానం. ఆయన ఆదిలాబాద్ కు రానున్నారని తెలుసుకున్న ఆమె..తన రక్తాన్ని తీసి అద్భుతమైన ప్రధాని చిత్రపటం వేయించారు. అందులో ప్రధాని మోడీ ఆవును నిమురుతూ కనిపించారు. ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో అవకాశం దొరికితే ఈ చిత్రపటానికి ప్రధానికి అందజేస్తానని ఆమె వెల్లడించారు. 

కాగా.. స్వప్న ఇంజక్షన్ ద్వారా రక్తాన్ని సేకరించడం, ప్రధాని చిత్రాన్ని వేయించడం, తరువాత దానిని ఫ్రేమ్ చేయించడానికి సంబంధించిన వీడియోను రూపొందించారు. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. 

నరేంద్ర మోడీ హిందువు కాదు - లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు (సోమవారం) ఉదయం ఆదిలాబాద్‌కు రానున్నారు. సోమవారం, మంగళవారాల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్వాగతించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రూ. 15 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలను చేపట్టనున్నారు. 

ఆదిలాబాద్‌లో సుమారు రూ. 6,700 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన తమిళనాడుకు వెళ్తారు. అక్కడ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రాజ్ భవన్‌లో బస చేస్తారు. మరుసటి రోజు సంగారెడ్డిలో నిర్వహించే సభలో పాల్గొంటారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios