Asianet News TeluguAsianet News Telugu

మేమున్నాం అక్కా : కవితకు మద్ధతుగా టీఆర్ఎస్ శ్రేణులు.. తెలంగాణ వ్యాప్తంగా ఫ్లెక్సీలు

కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గురి పెట్టడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు అండగా నిలుస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా కవితకు మద్ధతుగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.
 

Flexis put up to support for trs mlc kalvakuntla kavitha
Author
First Published Dec 3, 2022, 9:09 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు బయటకు రావడంతో పాటు సీబీఐ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. టిఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ .. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలలో ఈ ఫ్లెక్సీలను  ఏర్పాటు చేశారు‌ . రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే వేధింపులకు గురి అవుతున్న తమ అభిమాన నాయకురాలు స్వచ్ఛంగా వాటిని ఛేదిస్తుందని వాటిలో పేర్కొన్నారు. చైతన్యంతో కూడిన తెలంగాణలో విద్వేష పూరిత ప్రసంగాలతో ఓ వైపు  ప్రజలను రెచ్చగొడుతూ మరోవైపు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులను వేధిస్తే ఇక్కడి ప్రజలు ఊరుకోరని అరవింద్ హెచ్చరించారు.

కాగా... ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి.. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని కవిత నివాస చిరునామాను సీబీఐ నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా కవితకు సంబంధం ఉన్న కొన్ని వాస్తవాలను గుర్తించామని పేర్కొంది. అందువల్ల దర్యాప్తు కోసం ఆమె నుంచి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ALso REad:నోటీసులపై కల్వకుంట్ల కవిత స్పందన... ముందు ఆ రెండు డాక్యుమెంట్లు పంపండి : సీబీఐకి లేఖ

రెండు రోజుల క్రితం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరును ప్రస్తావించడంపై స్పందించిన కవిత.. ఎలాంటి విచారణను ఎదుర్కొవడానికైనా సిద్దమని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని  విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా మోదీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోదీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు. ఇలాంటి వాటిని పట్టించుకునే అవసరం లేదని అన్నారు. 

దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్‌లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడున్నారని విమర్శించారు ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐ‌లను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు. కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. ఇక, మీడియాతో మాట్లాడిన అనంతరం కవిత జగిత్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios