గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇంకా బిల్లులు రాకపోవడంతో సస్పెన్షన్ కు గురైన మహిళా సర్పంచ్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక, ఆ పనుల కోసం తీసుకున్న అప్పును తీర్చాలని వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఓ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలో చోటు చేసుకుంది. ఆమె ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.
నేడు స్కూల్స్, కాలేజీలు అన్ని బంద్.. ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్లెడ గ్రామ పంచాయతీకి లావణ్య అనే మహిళ గత ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అయితే గత సంవత్సరం ఆమెను అధికారులు సస్పెండ్ చేశారు. దుర్వినియోగం ఆరోపణలుతో ఆమెపై సస్పెన్షన్ వేటుపడింది. అయితే ఆమె సర్పంచ్ గా పదవిలో ఉన్న సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది.
మద్యం బిల్లు చెల్లించే విషయంలో గొడవ.. క్రికెట్ స్టంప్, కత్తితో దాడి చేసుకున్న కాబోయే డాక్టర్లు..
దీని కోసం అప్పు చేసి నిధులు సమకూర్చుకున్నారు. వాటి ద్వారానే పనులు చేపట్టారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు సకాలంలో అందలేదు. ఇలా రూ.20 లక్షల వరకు బిల్లలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. దీంతో లావణ్యకు ఆర్థికి ఇబ్బందులు అధికమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం ఆమె ఇంటికి అప్పుల వారు వచ్చారు. తమ అప్పును చెల్లించాలని చెప్పారు.
పేరు మారింది.. నెహ్రూ మెమోరియల్ ఇక నుంచి..
దీంతో ఆమె మనస్థాపానికి గురయ్యారు. తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు లావణ్యకు ట్రీట్ మెంట్ అందించారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
