ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్‌లో ఉన్న  నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) అధికారికంగా నేటి నుండి ప్రధాన మంత్రి మ్యూజియం, లైబ్రరీగా మార్చబడింది.

ఢిల్లీలోని దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అధికారిక నివాసమైన తీన్‌మూర్తి భవన్‌ ప్రాంగణంలోని నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ హౌస్‌ (NMML)పేరును కేంద్రం పేరు మార్చింది. నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియంను ప్రధాన మంత్రుల మ్యూజియం, లైబ్రరీ సొసైటీ (PMMS)గా పేరు మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మ్యూజియం పేరును జూన్ 16న మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని నేటీ నుంచి (ఆగస్టు 15) అమలులోకి తీసుకవచ్చింది.

నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చడంపై బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చరిత్ర తెలియని వారు చరిత్రను చెరిపేసే పనిలో పడ్డారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పేరు మార్పుతో ప్రధాని నెహ్రూ వ్యక్తిత్వాన్ని తగ్గించలేమని ఆయన అన్నారు.