తిరుమలలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్లు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మద్యం బిల్లు చెల్లించే విషయంలో స్టూడెంట్ల మధ్య మొదలైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వారంతా ఇంకో సంవత్సరం, రెండు సంవత్సరాలైతే డాక్టర్లు అవుతారు. రోగులకు సేవ చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు. కానీ వారే తప్పతాగారు. క్రమ శిక్షణతో ఉండాల్సిన మెడికల్ స్టూడెంట్లు ఆ మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ గొడవ అప్పటికి సద్దుమణిగినా తరువాత అదే విషయంలో మళ్లీ వాగ్వాదం చెలరేగింది. ఇది క్రికెట్ స్టంప్ లు, కత్తులతో దాడి చేసుకునేంత దూరం వెళ్లింది. ఈ ఘటన ఏపీలోని తిరుపతిలో ఉన్న ఎస్వీ మెడికల్ కాలేజీలో జరిగింది. 

ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు లేకపోతే.. లైంగిక దాడి కాదనడం సరికాదు: ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి వేంకటేశ్వర మెడికల్ కాలేజీలో వెంకటగిరి మండలానికి చెంది గణేష్ ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడే యూజీ హాస్టల్ లోని ఓ గదిలో తన సీనియర్లు అయిన మహేశ్‌, ప్రవీణ్‌తో కలిసి ఉంటున్నాడు. వీరిలో ఒకరిది నందలూరు కాగా.. మరొకరిది పలమనేరు. అయితే వీరంతా గత సోమవారం సాయంత్రం కలిసి కారులో బయటకు వెళ్లారు. అక్కడ ఈ ముగ్గురూ మద్యం సేవించారు. 

పేరు మారింది.. నెహ్రూ మెమోరియల్‌ ఇక నుంచి..

అయితే కొంత సమయం తరువాత బిల్లు వచ్చింది. దానిని చెల్లించే విషయంలో గొడవ జరిగింది. గతంలో కూడా ఈ ముగ్గురు మధ్య ఇలాంటి ఘర్షణ పరిస్థితి తలెత్తింది. అయితే ఈ సారి ఇద్దరు సీనియర్లు గణేష్ తో మాట్లాడలేదు. ఎందుకిలా చేస్తున్నారంటూ ఆ విద్యార్థి మిగితా ఇద్దరిని ప్రశ్నించారు. అయితే రాత్రి అందరూ పడుకున్న తరువాత ఓ క్రికెట్ స్టంప్ తీసుకొని గణేష్ మహేష్ తలపై దాడి చేశాడు. దీంతో బాధితుడు తీవ్రమైన నొప్పితో అరవడం మొదలుపెట్టాడు. 

అక్షర్‌ధామ్‌ను సందర్శించిన యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం.. వాస్తుకళకు ఫిదా

అలజడి వినిపించడంతో ప్రవీణ్ లేచాడు. గణేస్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని కొట్టాడు. దీంతో స్టంప్ కూడా విరిగిపోయింది. అనంతరం హాస్టల్ కిచెన్ లో ఉన్న కత్తిని తీసుకొచ్చి, మహేష్ పై దాడి చేశాడు. దీంతో బాధితులు ఇద్దరూ అరుపులు వేశారు. దీంతో అదే హాస్టల్ లో ఉంటున్న మిగితా విద్యార్థులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసి అతడు అక్కడి నుంచి పారిోయాడు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ క్షతగాత్రులను ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్ కు తీసుకెళ్లారు. వారిద్దరికీ ట్రీట్ మెంట్ అందించారు. ఈ ఘటనపై తిరుమల పడమర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.