ఎంబీఎస్ ఎండీ సుఖేష్ గుప్తా కస్టడీ:కోర్టులో ఈడీ పిటిషన్
ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు కోర్టులో గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్:ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు గురువారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు.ఎంబీసీ,ముసద్దీలాల్ జ్యుయలర్స్ సంస్థల్లో ఈ నెల16,17 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ముగిసిన తర్వాత సుఖేఫ్ గుప్తాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు .
రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో రూ.100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు కీలకమైన డాక్యుమెంట్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఎంఎంటీసీ సంస్థ నుండి బంగారం కొనుగోలు చేసి ఆ సంస్థకు సుఖేష్ గుప్తా డబ్బులు చెల్లించలేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే బంగారం విక్రయించగా వచ్చిన డబ్బును ఎక్కడికి తరలించారనే విషయమై ఈడీ అధికారులు సుఖేష్ గుప్తాను ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ మేరకు వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సుఖేష్ ను విచారిస్తే మరిన్నివిషయాలు తెలుస్తాయని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే కస్టడీకి ఇవ్వాలని కోరారు. అరెస్టైన సుఖేష్ గుప్తా ప్రస్తుతం చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.
ఎంబీఎస్ సంస్థపై ఎంఎంటీసీ సఃంస్థ ఇచ్చిన పిర్యాదుతో ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.సుఖేష్ గుప్తాపై ఫెమా,పీఎంఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఎంఎంటీసీ సంస్థ నుండి రూ. 500 కోట్ల విలువైన బంగారాన్ని ఎంబీఎస్ సంస్థ కొనుగోలు చేసింది. క్రెడిట్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే ఈ బంగారానికి సంబంధించి డబ్బులు ఎంబీఎస్ సంస్థ చెల్లించలేదు.ఎంఎంటీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2014లో సీబీఐ అధికారులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
ఆరు కేసుల్లో సుఖేష్ గుప్తా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. పెద్ద నగదు నోట్ల రద్దు సయంలో సుఖేష్ గుప్తా అక్రమాలకు పాల్పడినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తప్పుడు పత్రాలు సృష్టించి నగదును మార్పిడి చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
also read:రెండు రోజుల పాటు ఈడీ సోదాలు: ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా అరెస్ట్
ఫెమా,మనీలాండరింగ్ ఆరోపణలతో ఎంబీఎస్ సంస్థ కార్యకలాపాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.గతంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు .తాజాగా రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.