రెండు రోజుల పాటు ఈడీ సోదాలు: ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా అరెస్ట్
ఎంబీఎస్ చీఫ్ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు మంగళవారం నాడు రాత్రి అరెస్ట్ చేశారు . రెండు రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
హైదరాబాద్:ఎంబీఎస్ జ్యుయలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు.ఎంబీఎస్,ముసద్దీలాల్ జ్యుయలర్స్ సంస్థల్లో సోమ,మంగళవారాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలక ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు. రూ.100 కోట్ల విలువైన బంగారం,వజ్రాలను ఈడీ అధికారులు సీజ్ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎబీఎన్ కథనం ప్రసారం చేసింది.
ఎంబీఎస్ సంస్థపై ఎంఎంటీసీ సgస్థ ఇచ్చిన పిర్యాదుతో ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.సుఖేష్ గుప్తాపై ఫెమా,పీఎంఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.ఆరు కేసుల్లో సుఖేష్ గుప్తా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. పెద్ద నగదు నోట్ల రద్దు సయంలో సుఖేష్ గుప్తా అక్రమాలకు పాల్పడినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తప్పుడు పత్రాలు సృష్టించి నగదును మార్పిడి చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
ఎంఎంటీసీ సంస్థ నుండి రూ.500 కోట్ల విలువైన బంగారాన్ని ఎంబీఎస్ సంస్థ కొనుగోలు చేసింది. క్రెడిట్ పథకం కింద ఈ బంగారం కొనుగోలు చేశారు .అయితే ఈ డబ్బులు చెల్లించకుండా ఎగవేశారు.దీంతో ఎంఎంటీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2013లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2014లో సీబీఐ అధికారులు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు.
also read:ఎంబీఎస్ జ్యుయల్లర్స్ లో ముగిసిన ఈడీ సోదాలు:రూ.100 కోట్ల విలువైన బంగారం,వజ్రాలు సీజ్
ఫెమా,మనీలాండరింగ్ ఆరోపణలతో ఎంబీఎస్ సంస్థ కార్యకలాపాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.గతంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు .తాజాగా రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఎంఎంటీసీ నుండి బంగారం కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు కూడా కేటాయించలేదు.ఎంబీసీ సంస్థకు ఎంఎంటీసీ అధికారులు సహకరించారని ఈడీ అధికారులు గుర్తించారు. రెండు రోజులు నిర్వహించిన సోదాల్లో లభ్యమైన కీలక పత్రాల ఆధారంగా సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఈ కథనం తెలిపింది.ఈ కేసులో మరో ఇద్దరు కీలకంగా వ్యవహరించారని ఈడీ అధికారులు గుర్తించారు .రెండు మూడు రోజుల్లో మరో ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.