కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవినీతి బంధం: సంగారెడ్డి బీజేపీ సభలో మోడీ
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. సంగారెడ్డిలో బీజేపీ విజయసంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు.
సంగారెడ్డి:అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ తనను విమర్శిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు.కుటుంబ పార్టీలతో ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతుందని మోడీ చెప్పారు.యువతకు అవకాశాలు రావడం లేదన్నారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువని మోడీ విమర్శించారు.
also read:టీడీపీలో చేరుతా:వైఎస్ఆర్‌సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా
మీ ఆశీర్వాదాలను వృధాకానివ్వను... ఇది మోడీ గ్యారంటీ అని ఆయన హామీ ఇచ్చారు. మోడీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడన్నారు.ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారిందన్నారు.భారత్ ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాల్సిన అవసరం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు.ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారని మోడీ గుర్తు చేశారు.
also read:హైద్రాబాద్‌లో ఏవియేషన్ సెంటర్‌తో ఉపాధి: సంగారెడ్డిలో రూ. 7,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.అయోధ్యలో రామమందిరం నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగిందన్నారు.
also read:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం: ప్రత్యేక పూజలు చేసిన మోడీ
అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ అని మోడీ చెప్పారు.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కుటుంబపార్టీలు పాలించాయన్నారు. కుటుంబ పార్టీలు ఉన్న చోట కుటుంబాలు బాగుపడ్డాయన్నారు.కుటుంబ పార్టీలకు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా అని మోడీ ప్రశ్నించారు.
ప్రజల నమ్మకాన్ని తానేప్పుడూ వమ్ముకానివ్వనని చెప్పారు.దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారన్నారు. 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబంగా మోడీ పేర్కొన్నారు.70 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపినట్టుగా మోడీ చెప్పారు.కోట్లాది దళిత యువత స్వప్నాలను సాకారం చేసినట్టుగా మోడీ గుర్తు చేశారు.తెలంగాణలో మాదిగల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు.
also read:ఉద్యోగం కోసం సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్: పలు సంస్థల నుండి ఇంటర్వ్యూల కోసం ఆఫర్లు
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటేనని మోడీ విమర్శించారు.నాణెనికి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ అని మోడీ సెటైర్లు వేశారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ప్రజలకు అర్ధమైందన్నారు.కాళేశ్వరం పేరుతో వందల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వంలో అవినీతి జరిగిందని తెలిసి కూడ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బలమైన అవినీతి బంధం ఉందని ఆయన ఆరోపించారు.