హైద్రాబాద్‌లో ఏవియేషన్ సెంటర్‌తో ఉపాధి: సంగారెడ్డిలో రూ. 7,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ
తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజున సంగారెడ్డి జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
హైదరాబాద్:రాష్ట్రాల అభివృద్దే దేశ అభివృద్ది అని తాను నమ్ముతానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు పర్యటించారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని పటేల్ గూడలో రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
also read:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం: ప్రత్యేక పూజలు చేసిన మోడీ
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఇవాళ రెండో రోజు తెలంగాణ ప్రజలతో ఉండడం సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నిన్న ఆదిలాబాద్ నుండి రూ. 56 వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభించిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు. ఇవాళ సంగారెడ్డి నుండి రూ. 7 వేల కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించినట్టుగా ఆయన చెప్పారు.
also read:తెలంగాణలో రెండో రోజు మోడీ టూర్: రూ.7,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించించనున్న ప్రధాని
వికసిత్ భారత్ దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మోడీ చెప్పారు.ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ది చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను బేగంపేట్ లో ఏర్పాటు చేసిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. ఈ సెంటర్ ద్వారా హైద్రాబాద్, తెలంగాణకు గుర్తింపు వస్తుందని మోడీ చెప్పారు.ఏవియేషన్ కేంద్రం స్టార్టప్ లు, నైపుణ్య శిక్షణకు వేదికగా నిలవనుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ తో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని తెలిపారు.
also read:ఉద్యోగం కోసం సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్: పలు సంస్థల నుండి ఇంటర్వ్యూల కోసం ఆఫర్లు
పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపైన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.బడ్జెట్ లో మౌళిక సదుపాయాల కోసం రూ. 11 లక్షల కోట్లు కేటాయించినట్టుగా మోడీ చెప్పారు. వికసిత భారత్ కు ఆధునిక, మౌలిక సౌకర్యాలు అవసరమన్నారు.