MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Rain Alert: దూసుకొస్తున్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో ఉరుముల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు, అల్లకల్లోలం ఖాయం

Rain Alert: దూసుకొస్తున్న అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో ఉరుముల‌తో కూడిన‌ భారీ వ‌ర్షాలు, అల్లకల్లోలం ఖాయం

Rain Alert: ఫిబ్రవరిలోనే ఎండలు రికార్డులు తాకుతున్న వేళ… బంగాళాఖాతం నుంచి వర్షాల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుంటే, మరోవైపు అల్పపీడనం తెలుగు రాష్ట్రాల‌కు కూల్ న్యూస్ చెప్పింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 22 2026, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో అల్పపీడనం
Image Credit : istock

బంగాళాఖాతంలో అల్పపీడనం

నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది. ఈ వ్యవస్థ ప్రభావంతో తేమ గాలులు భూభాగంలోకి చొచ్చుకువస్తాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మోస్తరు జల్లులు పడే పరిస్థితి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలో ఎక్కడ వర్షాలు?
Image Credit : Asianet News

ఏపీలో ఎక్కడ వర్షాలు?

అల్పపీడనం ప్రభావం ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములు ఉండే పరిస్థితి ఉన్నందున ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచనలు జారీ అయ్యాయి. రాబోయే 48 గంటలు కీలకం కానున్నాయి.

Related Articles

Related image1
మీరు కూడా స‌మ‌స్యను చూసి పారిపోతున్నారా.? ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం.
Related image2
రూ. 50 వేల జీత‌మున్న వారు కూడా ఈ ల‌గ్జ‌రీ కారును కొనొచ్చు.? నెల‌కు ఎంత ఈఎమ్ఐ అంటే
35
తెలంగాణలో మూడు రోజుల వర్ష సూచన
Image Credit : Asianet News

తెలంగాణలో మూడు రోజుల వర్ష సూచన

శ్రీలంక సముద్ర తీరానికి సమీపంగా ఉన్న వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై కూడా కనిపించనుంది. ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణలో ఆకాశం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. అయితే విస్తృత స్థాయిలో భారీ వర్షాల సూచనలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

45
హైదరాబాద్‌లో వాతావర‌ణం
Image Credit : Asianet News

హైదరాబాద్‌లో వాతావర‌ణం

ఫిబ్రవరి చివరి వారంలోనే నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ దాకా చేరుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత కనిపించనుంది. సాయంత్రం వేళల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత కూడా అనుభూతి కావచ్చు. వర్షం పడే ప్రాంతాల్లో ఒక్కసారిగా గాలులు వేగంగా వీచే పరిస్థితి ఉండవచ్చు. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. 

55
వేస‌విలో చుక్క‌లే
Image Credit : Asianet News

వేస‌విలో చుక్క‌లే

ఈ ఏడాది వేసవి సాధారణం కంటే ముందుగానే ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ స్థాయికి మించి 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలులో ఇప్పటికే 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ విశ్లేషణల ప్రకారం ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అల్పపీడనం వల్ల వచ్చే జల్లులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి కానీ ఆ తర్వాత ఉక్కపోత పెరగవచ్చు. ఈ వాతావ‌ర‌ణ మార్పులు ఆరోగ్యాల‌పై ప్ర‌భావం ప‌డ‌తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
మీరు కూడా స‌మ‌స్యను చూసి పారిపోతున్నారా.? ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం.
Recommended image2
రూ. 50 వేల జీత‌మున్న వారు కూడా ఈ ల‌గ్జ‌రీ కారును కొనొచ్చు.? నెల‌కు ఎంత ఈఎమ్ఐ అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved