Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలో చేరుతా:వైఎస్ఆర్‌సీపీకి గుమ్మనూరు జయరాం రాజీనామా

వైఎస్ఆర్‌సీపీకి షాక్ ఇచ్చారు మంత్రి గుమ్మనూరు జయరాం.  వైఎస్ఆర్‌సీపీకి  జయరాం రాజీనామా చేశారు. తెలుగుదేశంలో చేరనున్నట్టుగా ఆయన ప్రకటించారు.

minister Gummanuru Jayaram Resigns to YSRCP and MLA post lns
Author
First Published Mar 5, 2024, 12:11 PM IST

విజయవాడ: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)కి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా  గుమ్మనూరు జయరాం  ప్రకటించారు. మంగళవారం నాడు  విజయవాడలో మంత్రి గుమ్మనూరు జయరాం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.  ఇవాళ మంగళగిరిలో నిర్వహించే టీడీపీ జయహో బీసీ సభలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతానని జయరాం చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో  గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. 

also read:ఒక్క ఎంపీ స్థానం ఇవ్వండి: తెలంగాణ కాంగ్రెస్‌ను కోరిన సీపీఐ

ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఆలూరు అసెంబ్లీ టిక్కెట్టును గుమ్మనూరు జయరాం కు కేటాయించేందుకు  వైఎస్ఆర్‌సీపీ నిరాకరించింది. ఆలూరు అసెంబ్లీ స్థానంలో జయరాం స్థానంలో విరూపాక్షిని బరిలోకి దింపనుంది.  దరిమిలా  జయరాం  తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.  టీడీపీలో చేరడానికి చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో  జయరాం ఇవాళ వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు.

also read:హైద్రాబాద్‌లో ఏవియేషన్ సెంటర్‌తో ఉపాధి: సంగారెడ్డిలో రూ. 7,200 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

కర్నూల్ ఎంపీ స్థానం నుండి కూడా తప్పించే ప్రయత్నాలు చేశారని ఆయన జగన్ పై ఆరోపణలు చేశారు.ఈ పరిణామాలతో వైఎస్ఆర్‌సీపీ నుండి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా జయరాం చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios