Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తులో డబ్బులకోసం గొడవపడి భర్తను చంపిన మహిళ...

చిట్ ఫండ్ డబ్బులు ఎలా ఖర్చుచేయాలన్న దానిమీద మద్యం మత్తులో భార్యాభర్తలు గొడవపడ్డారు. రాయి, రోకలితో దాడి చేసి హత్య చేసింది. 

drunken woman killed her husband in a fight over money in hyderabad - bsb
Author
First Published Sep 21, 2023, 10:01 AM IST

హైదరాబాద్‌ : చిన్న చిన్న గొడవలతో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మామూలుగా మారిపోయింది. ఇలాంటి ఓ షాకింగ్ ఘటనలో భర్తను హతమార్చిందో భార్య. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే.. చిట్‌ఫండ్‌  లో వచ్చి రూ.2 లక్షల డబ్బును ఎలా ఖర్చు చేయాలనే విషయమై మద్యం మత్తులో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 

మంగళవారం రాత్రి నగర శివార్లలోని కొత్తూరు వద్ద జరిగిన ఈ గొడవలో మద్యం మత్తులో ఓ మహిళ తమ ఇంట్లోనే భర్తను హత్య చేసింది. మృతుడు కొత్తూరు మండలం పంజెర్ల గ్రామానికి చెందిన పి నర్సింహులు (50) అనే మూగవ్యక్తి. ఆయన భార్య నర్సమ్మ కూరగాయల వ్యాపారి.

ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి కోసమే గోవా నుంచి డ్రగ్స్ - కస్టడీలో రోదిస్తూ చెప్పిన అనురాధ

కొన్ని రోజుల క్రితం, ఈ జంట తమ చిట్ ఫండ్ పెట్టుబడి నుండి రూ. 2 లక్షల నగదు తీసుకున్నారు. ఆ డబ్బుతో బైక్ కొనాలని నర్సింహులు భావించగా, అతని భార్య బంగారం కొనాలనుకుంది. మంగళవారం రాత్రి ఇద్దరూ మద్యం సేవించి డబ్బులు ఎలా ఖర్చు చేయాలనే విషయమై వాగ్వాదం జరిగింది.

వాగ్వాదం జరుగుతుండగా నర్సమ్మపై నర్సింహులు దాడి చేశాడు. ఆమె కూడా రాయి, రోకలితో దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలతో నర్సింహులు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నర్సమ్మ, ఆమె బంధువులు రాత్రి స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కొత్తూరు ఇన్‌స్పెక్టర్ కె శంకర్ రెడ్డి తెలిపారు. నర్సమ్మను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios