నగరంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు చేధించారు. లారీ డ్రైవర్, క్లీనర్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.  ముందుగానే స్కూటర్ పంచర్ చేసి... ఆమెను ట్రాప్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రియాంకపై అత్యాచారం చేసేందుకు దుండగులు స్కూటీ డ్రామా ఆడారని చెబుతున్నారు.

AlsoRead  రోజురోజుకి భయం పెరిగిపోతుంది.. ప్రియాంకారెడ్డి ఘటనపై కీర్తి సురేష్!

ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. టోల్ ప్లాజా వద్ద ఉన్నా లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.  ప్రియాంక రెడ్డిపై గ్యాంగ్ రేప్  జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. 

AlsoRead ప్రియాంక రెడ్డి హత్య ఎఫెక్ట్...వాహనం పాడైతే మాకు చెప్పండంటున్న పోలీసులు...

టోల్ ప్లాజా వెనక వైపు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అనంతరం.. ఆమె మెడకు చిన్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. కాగా... చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి... అనంతరం పెట్రోల్  పోసి తగలపెట్టారని చెబుతున్నారు. 

ప్రియాంక రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ పాషాగా గుర్తించారు. అతనిది మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట అని పోలీసులు చెబుతున్నారు

కాగా.. ప్రియాంక ప్రయాణించిన స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. దుండగులు స్కూటీ నెంబర్ ప్లేట్లను తొలగించి బస్టాండ్ దగ్గర వెదిలివెళ్లారు. 

AlsoReadప్రియాంక రెడ్డి స్కూటీ, లోదుస్తులు లభ్యం.... ఆ ఇద్దరిపైనే అనుమానం.....

స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్కూటీ దొరికిన ప్రాంతాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రియాంకను హత్య చేసింది అనంతపూర్‌కు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు‌గా అనుమానిస్తున్నారు. లారీ నెంబర్‌ను కూడా పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా.. ప్రియాంకరెడ్డి హత్య జరిగిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. శంషాబాద్ టోల్‌గేట్ పక్కనున్న కాంపౌండ్ వద్ద ప్రియాంక ఇన్నర్‌వేర్‌తో పాటు చెప్పులను పోలీసులు గుర్తించారు. అలాగే వాటి పక్కనే మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

AlsoRead లారీలను అడ్డం పెట్టి ప్రియాంకపై అత్యాచారం, హత్య..?: పోలీసుల వద్ద ఆధారాలు...

కాగా.. రాత్రి పది తర్వాత ప్రియాంక కిడ్నాప్ కాగా... ఆమె రాత్రి 3గంటల ప్రాంతంలో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ మధ్యలో ఐదుగంటలు ఆమెకు ఆ రాక్షసులు నరకం చూపించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దుండగులు ప్రియాంకపై లారీలను అడ్డంపెట్టుకుని అత్యాచారం చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్ వద్ద వున్న సీసీ కెమెరాల్లో లారీలు తిరిగిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఘటనాస్థలంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు డాగ్‌స్క్వాడ్ సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు