Asianet News TeluguAsianet News Telugu

రోజురోజుకి భయం పెరిగిపోతుంది.. ప్రియాంకారెడ్డి ఘటనపై కీర్తి సురేష్!

అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం కోరుతున్నారు. 

Star Heroine Keerthy Suresh Emotional post on Priyanka Reddy's death
Author
Hyderabad, First Published Nov 29, 2019, 11:42 AM IST

హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంకతిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగా ఉందని చెప్పిన  కొద్ది సేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దాంతో కుటుంబ సభ్యులు పోలీలకు ఫిర్యాదు చేశారు.

అయితే కుటుంభ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచాయలు 
అలుముకున్నాయి. మరోవైపు ఈ హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ముందే స్కూటర్ పంచర్ చేసి... ప్రియాంక రెడ్డి కేసును చేధించిన పోలీసులు

కావాలనే ప్రియాంకరెడ్డి స్కూటీ పంక్చర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. లారీల మధ్య ప్రియాంకరెడ్డిని రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారని విచారణలో తేలింది. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది. 

ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం కోరుతున్నారు. తాజాగా ఈ ఘటనపై నటి కీర్తి సురేష్ స్పందించింది. ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందని, అత్యంత క్రూరంగా ప్రియాంకా రెడ్డిని మానభంగం చేసి, హత్య చేశారని.. ఈ ఘటనల వలన  రోజురోజుకి భయం మరింత పెరిగిపోతుందని అన్నారు.  

ఇలాంటి దారుణ సంఘటన జరగడంతో.. నాకు ఏ మాట్లాడాలో కూడా తెలీడం లేదు. ఈ ఘటనలో ఎవరిని నిందించాలో కూడా అర్థం కావడం లేదని అన్నారు.  మన దేశంలో ఆడవాళ్లకి భద్రత దొరకదా..? రోడ్డు మీద తిరిగే స్వేచ్చ కూడా లేదా అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న సైకోలను వెతికి శిక్షించాలని చెప్పారు. ప్రియాంకా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios