Asianet News TeluguAsianet News Telugu

లారీలను అడ్డం పెట్టి ప్రియాంకపై అత్యాచారం, హత్య..?: పోలీసుల వద్ద ఆధారాలు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

priyanka reddy murder case: key evidence found by hyderabad police
Author
Hyderabad, First Published Nov 28, 2019, 6:07 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందరూ ముందు నుంచి అనుమానిస్తున్నట్లుగానే ఆమెపై లారీ డ్రైవర్లే అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసులు నిర్థారణకు వస్తున్నారు.

ఈ క్రమంలో ప్రియాంకరెడ్డి హత్య జరిగిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. శంషాబాద్ టోల్‌గేట్ పక్కనున్న కాంపౌండ్ వద్ద ప్రియాంక ఇన్నర్‌వేర్‌తో పాటు చెప్పులను పోలీసులు గుర్తించారు. అలాగే వాటి పక్కనే మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దుండగులు ప్రియాంకపై లారీలను అడ్డంపెట్టుకుని అత్యాచారం చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్ వద్ద వున్న సీసీ కెమెరాల్లో లారీలు తిరిగిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఘటనాస్థలంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు డాగ్‌స్క్వాడ్ సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. 

కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాత్రి 9.45 గంటలకు ప్రియాంక తన సోదరితో ఫోన్‌లో మాట్లాడిందని.. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసినట్లు తాము అనుమానిస్తున్నామని.. అనంతరం ప్రియాంకపై అత్యాచారానికి పాల్పడి హతమార్చి ఉండవచ్చని డీసీపీ తెలిపారు. 

హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక రెడ్డి అనే యువతి బుధవారం ట్రీట్మెంట్ కోసం మాదాపూర్ లోని హాస్పిటల్ కి వెళ్లింది. మార్గ మధ్యంలో స్కూటీ పాడయ్యిందని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. తన స్కూటీ ఆగిపోయిన ప్రాంతంలో లారీ డ్రైవర్లు ఉన్నారంటూ ఫోన్ లో ప్రియాంక భయంగా చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కాగా... ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆమె ఫోన్ కి ప్రయత్నించినా కలవలేదు. తీరా చూస్తే... గురువారం ఉదయం శవమై కనిపించింది. ఆమెను సజీవదహనం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

. ప్రియాంక రెడ్డి... వృత్తి రిత్యా డాక్టర్ అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి కింద శవం దొరికింది. ప్రియాంక రెడ్డి  నవాబుపేట మండలం కొల్లూరులో వెటర్నరీ డాక్టర్ గా పనిచేస్తోందని తెలిసింది.

ఎక్కడో హత్య చేసి శవాన్ని అండర్ బ్రిడ్జి కింద తగలపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పంక్చర్ అయ్యిందని లారీ డ్రైవర్లు చెప్పారని ప్రియాంక సోదరి చెబుతోంది.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కారులో ఆమెను కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ప్రియాంక మృతదేహానికి షాద్‌నగర్‌లో పోస్ట్‌మార్టం పూర్తిచేసి, కుటుంబసభ్యులకు అప్పగించారు. చివరిసారిగా లారీడ్రైవర్లు తనను చుట్టుముట్టారని ప్రియాంక ఏడస్తూ ఫోన్‌లో తన సోదరికి చెప్పింది.

లారీడ్రైవర్ల వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పంక్చర్ షాప్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

అలాగే ప్రియాంక స్కూటీ టైర్‌ను కావాలనే పంక్చర్ చేసి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చివరిగా ప్రియాంక తన సోదరితో కాకుండా ఇంకా ఎవరెవరితో మాట్లాడింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios