నగరంలో డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు సంచలనం రేపింది. స్కూటీ పంచర్ కావడమే ఆమె పాలిట శాపంగా మారింది. ఆమె దారుణ హత్య నేపథ్యంలో... రాచకొండ పోలీసులు ఓ ప్రకటన చేశారు. 

వాహనాలపై వెళ్లేటప్పుడు బైక్ పంచర్ లాంటి సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.  స్థానిక పోలీసులు వెంటనే స్పందించి వాహనాన్ని మరమత్తు చేయించడం లేదా గమ్యస్థానానికి చేర్చడంలో సహాయం అందిస్తారని చెప్పారు.

AlsoRead అప్పుడే స్పందించి ఉంటే... ప్రియాంక తండ్రి ఆవేదన...

ఈమేరకు పోలీసు కంట్రోల్ రూం.నెం.100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. 9490617111 వాట్సాప్ నెంబర్ కి లొకేషన్ కూడా షేర్ చేయవచ్చని చెప్పారు. తాజాగా షాద్ నగర్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసుతో పాటు నగర శివారులో హత్యోదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా...ప్రియాంక ప్రయాణించిన స్కూటీని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. దుండగులు స్కూటీ నెంబర్ ప్లేట్లను తొలగించి బస్టాండ్ దగ్గర వెదిలివెళ్లారు. 

Also Read ప్రియాంక రెడ్డి స్కూటీ, లోదుస్తులు లభ్యం.... ఆ ఇద్దరిపైనే అనుమానం.....

స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్కూటీ దొరికిన ప్రాంతాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రియాంకను హత్య చేసింది అనంతపూర్‌కు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్లు‌గా అనుమానిస్తున్నారు. లారీ నెంబర్‌ను కూడా పోలీసులు గుర్తించారు.

 

ఇదిలా ఉండగా.. ప్రియాంకరెడ్డి హత్య జరిగిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. శంషాబాద్ టోల్‌గేట్ పక్కనున్న కాంపౌండ్ వద్ద ప్రియాంక ఇన్నర్‌వేర్‌తో పాటు చెప్పులను పోలీసులు గుర్తించారు. అలాగే వాటి పక్కనే మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా.. రాత్రి పది తర్వాత ప్రియాంక కిడ్నాప్ కాగా... ఆమె రాత్రి 3గంటల ప్రాంతంలో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ మధ్యలో ఐదుగంటలు ఆమెకు ఆ రాక్షసులు నరకం చూపించి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.