సంచలనం సృష్టించిన దిశ కేసులో ప్రజలందరూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ముక్తకంఠంతో నినదించారు. తీరా అనుకోకుండా జరిగిన సంఘటనలో నిందితులు ఎన్కౌంటర్ అయ్యాక ఇప్పుడు పోలీసుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నిన్నటివరకు ప్రజలే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలంటూ ఊరేగింపులు, ధర్నాలు,ర్యాలీలు చేశారు కానీ ఇప్పుడు అదేదో ఎన్కౌంటర్ సంఘటన జరిగాక ఆ ప్రజల్లోని కొందరు వ్యక్తులే పోలీసులపై మానవ హక్కులంటూ కేసులు పెట్టడం విస్మయానికి గురిచేస్తుంది. 

ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.మానవహక్కుల కమిషన్ నోటీసులతో ఇప్పటికే తెలంగాణ పోలీసులు పౌరహక్కుల సంఘాలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కడ కేసేస్తే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. మొన్నటివరకేమో పోలీసులను తిడుతూ నిందితులను ఎన్కౌంటర్ చేయాలంటూ ఆగ్రహించిన ప్రజలు ఇప్పుడు పోలీసులకు మద్దతుగా నిలవలేకపోతున్నారు. పోలీసులేమో మానవహక్కుల నోటీసులందనుకొని వారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

కానీ సోషల్ మీడియాలో మాత్రం తెలంగాణ పోలీసులకు విపరీతమైన మద్దతు లభిస్తుంది. పోలీసులపై కేసులేసిన ఇప్పటికే వారిని దుమ్ము దులుపుతున్నారు. దిశకు అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మానవహక్కుల నేతలమని చెప్పుకునేవారంతా కళ్ళు తెరవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.