నల్గొండ జిల్లాకు చెందిన ఓ డ్యాన్స్ మాస్టర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన కొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. పెళ్లి కావడం లేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

నల్గొండ జిల్లా కోదాడకు చెందిన డ్యాన్స్ మాస్టర్ దార సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన స్వగ్రామమైన కొమరబండలో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంచి డ్యాన్స్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఇలా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.

అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టు

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 30 ఏళ్ల దార సురేష్ డ్యాన్స్ మాస్టర్ గా తన వృత్తి కొనసాగిస్తున్నాడు. అయితే కొంత కాలం నుంచి ఆయన మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. దానికి బానిసగా మారిపోయాడు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కావడం లేదని ఆయన ఆందోళన చెందాడు. జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లోనే శుక్రవారం ఆత్మహత్యకు ఒడిగట్టాడు. 

కొంత సమయం తరువాత ఓ స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్లాడు. లోపలి నుంచి తలుపు వేసి ఉంటడాన్ని గమనించాడు. స్నేహితుడిని పిలుస్తూ.. తలుపు తీయాలని కోరాడు. ఎంత సేపటికి లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో అనుమానం వచ్చింది. కిటికీ నుంచి లోపలికి చూశాడు. దీంతో సురేష్ ఆత్మహత్య చేసుకొని కనిపించాడు.

ముగిసిన ప్రధాని మోడీ ప్రాన్స్ పర్యటన.. ఫ్రెంచ్-ఇండియా స్నేహం చిరకాలం కొనసాగుతుందంటూ మాక్రాన్ ట్వీట్

ఈ విషయాన్ని వెంటనే అతడు సురేష్ కుటంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది. 

జమ్మూకాశ్మీర్ లో దారుణం.. ముగ్గురు వలస కార్మికులను హతమార్చిన ఉగ్రవాదులు..

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.