Asianet News TeluguAsianet News Telugu

కోవిషీల్డ్ తీసుకున్న మూడు నెలలే రక్షణ - కొత్త అధ్యయన ఫలితాలు వెల్లడించిన లాన్సెట్‌ జర్నల్‌

కోవిషీల్డ్ తీసుకున్న 3 నెలల తరువాత దాని రక్షణ వలయం క్షీణిస్తోందని కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయన ఫలితాలను లాన్సెట్‌ జర్నల్ ప్ర‌చురించింది.

Covshield three months of protection - Lancet Journal reveals new study results
Author
Hyderabad, First Published Dec 22, 2021, 11:22 AM IST

ఓమిక్రాన్ వేరియంట్ విరుచుకుప‌డుతోంది. రోజు రోజుకు ఆ వేరియంట్ బాధితులు పెరిగిపోతున్నారు. ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌కు విస్త‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 37 దేశాల్లో ఈ ఓమిక్రాన్ వేరియంట్ భ‌య‌ట‌ప‌డింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. మన దేశంలో కూడా దీని ప్ర‌భావం క‌నిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఓమిక్రాన్ పాజిటివ్ కేసులు 200కు పైగా న‌మోద‌య్యాయి. మ‌రోవైపు డెల్టా వేరియంట్ ర‌కానికి చెందిన క‌రోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్ -19 బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో అధ్య‌యనం కూడా అలాంటి విష‌యాల‌నే వెలుగులోకి తెచ్చింది. 

టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

మూడు నెల‌ల త‌రువాత ర‌క్ష‌ణ క్షీణిస్తోంది..
మ‌న దేశంలో కోవాక్సిన్‌, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. కోవాగ్జిన్‌ను హైద‌రాబాద్ కేంద్రంగా న‌డిచే భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారుచేయ‌గా.. కోవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్‌– ఆస్ట్రాజెన్‌కా లు క‌లిసి త‌యారు చేశాయి.ఈ రెండు వ్యాక్సిన్‌ల‌ను భార‌త‌దేశం అంత‌టా కేంద్ర ప్ర‌భుత్వం ఉచితంగా అంద‌జేసింది. అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఓ కొత్త అధ్యయనం వ‌చ్చింది. క‌రోనా వైర‌స్‌ను ఈ వ్యాక్సిన్ స‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటుంద‌ని తెలిపింది. అయితే మూడు నెల‌ల త‌రువాత మాత్రం క‌రోనా ను ఎదురించే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మాత్రం క్షీణిస్తోంద‌ని తెలిపింది. ఈ అధ్య‌య‌నం ఫ‌లితాల‌ను లాన్సెట్‌ జర్నల్ ప్ర‌చురించింది. ఈ అధ్య‌యనం కోసం బ్రెజిల్‌, స్కాట్‌లాండ్ దేశాల నుంచి స్టాటిస్టిక్స్ సేక‌రించారని పేర్కొంది. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు బూస్ట‌ర్ డోసు వేసుకుంటే ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంద‌ని చెప్పింది. కొత్త కొత్త వేరియంట్ల‌ను బ‌ట్టి ప్రొట‌క్ష‌న్ త‌గ్గే స్థాయిలో కొంత వ్య‌త్యాసం ఉంటుంద‌ని తెలిపింది. భార‌త ప్ర‌భుత్వం ఈ వ్యాక్సిన్ ను గుర్తించింది. పౌరుల‌కు ఈ వ్యాక్సిన్ అందించింది. కాబ‌ట్టి భార‌త్‌లో కోవిషీల్డ్ వేసుకున్న వారి ర‌క్ష‌ణ త‌గ్గుతుంద‌ని తెలిసిన వెంట‌నే బూస్ట‌ర్ డోసులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధ్య‌య‌నం తెలిపింది. 

ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో WHO వ్యాఖ్యలు

24 గంట‌ల్లో 6,317 మందికి క‌రోనా
ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 6,317 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో  దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,47,58,481కి చేరింద‌ని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 3,42,01,966 కోలుకున్నార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం 78,190 యాక్టివ్‌ కేసులున్నాయ‌ని చెప్పింది. గ‌త  24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 318 మంది మృతి చెందార‌ని తెలిపింది.  ఈ మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశంలో క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,78,325కు చేరింది. రిక‌వ‌రీ రేటు  98.4 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.35 శాతంగా ఉంది. క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్ అయ్యాయి. పరీక్ష‌ల‌ను అధిక సంఖ్య‌లో నిర్వహిస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో  10,14,079 టెస్ట్‌లు చేసింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 66,61,26,659 క‌రోనా ప‌రీక్ష‌లు ఐసీఎంఆర్ పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios