టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సెటైర్లు వేశారు. గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశం సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్.. పొన్నా పేరును ప్రస్తావించడం మరచిపోయారు. దీనిపై మనస్తాపానికి గురైన లక్ష్మయ్య... తన పేరు పొన్నాల అంటూ ప్రెస్‌మీట్ తర్వాత ఉత్తమ్‌కు కౌంటర్ వేశారు.

వెంటనే స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పొన్నాలకు సారీ చెప్పారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఉత్తమ్... టీఆర్ఎస్ హామీలపై ప్రజల్లో చర్చ పెడతామని అన్నారు. రేపటి నుంచి 27 వరకు అన్ని మున్సిపాలిటీల్లో ఫ్లాగ్‌మార్చ్ నిరసనలు తెలియజేస్తామని చెప్పారు.

బీజేపీ నుంచి దేశాన్ని, టీఆర్ఎస్ నుంచి తెలంగాణను కాపాడుదామనే నినాదంతో వెళ్తామన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని కేసీఆర్ స్పష్టం చేయాలని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమని, బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఉత్తమ్ ఆరోపించారు. 

Also Read:

హాజీపూర్ కేసు: జడ్జి ప్రశ్నలకు నోరు మెదపని శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణను తాకిన రాజధాని సెగ: ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలకు డిమాండ్

సమత కేసు: 'ఊహాజనిత ఆధారాలతో చార్ఝీషీట్ దాఖలు'