అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాల తొలగింపు వివాదంతో పాటు సంస్థలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగింది.

దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి బైఠాయించారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ ముందు నిర్వహించిన ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

దయాళ్ సింగ్ కళాశాల నుంచి సీబీఐ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను దాటుకుని ఆఫీసులోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై వాటర్‌కేనన్లు, భాష్పవాయువును ప్రయోగించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

సీబీఐ హెడ్‌క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ ఆందోళన: రాహుల్ అరెస్ట్

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు

హైదరాబాద్‌లో సీబీఐ దాడులు.. ప్రముఖుల ఇళ్లలో సోదాలు

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ VS రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ