తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అక్టోబర్ 16 తేదీన ఒకేసారి అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అక్టోబర్ 16 తేదీన ఒకేసారి అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాష్ట్రంలో పది చోట్ల నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించేందుకు గాను టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ నాలుగు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలను త్వరలోనే పూర్తికానున్నాయి.
అక్టోబర్ 16 వతేదీన కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తోంది కనీసం 75కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. మిగిలిన సీట్లలో మిత్రపక్షాలకు టిక్కెట్లను కేటాయించాలని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది. అయితే మిత్రపక్షాలు ఇంకా ఎక్కువ సీట్లను కోరుకొంటున్నాయి.
మహా కూటమిలోని పార్టీల మధ్య చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కోసం వచ్చిన ధరఖాస్తులను పార్టీ స్క్రినింగ్ కమిటీ పరిశీలించనుంది. ఒక్కొక్క స్థానానికి 15 పైగా ధరఖాస్తులు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సుమారు వెయ్యికి పైగా ధరఖాస్తులను పరిశీలించి ఒక్కొక్క సెగ్మెంట్‌కు ముగ్గురు పేర్లను పార్టీ నాయకత్వానికి పీసీసీ పంపినట్టు సమాచారం.
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఈ ముగ్గురిలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యులు రెండు రోజుల్లో మరోసారి హైద్రాబాద్‌లో పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థుల ప్రకటనతో పాటు పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో కూడ తెలంగాణలో సభలను నిర్వహించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు.
తెలంగాణలో పది చోట్ల కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభల్లో రాహుల్‌గాంధీ పాల్గొంటారు. ఈ సభల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనున్నారో రాహుల్ వివరించనున్నారు.
మరో వైపు హైద్రాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక చోట సోనియాగాంధీతో సభను ఏర్పాటు చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రెండు రోజుల్లో ఆ పార్టీ నేతలు ఈ విషయమై రూట్ మ్యాప్‌ను సిద్దం చేయనున్నారు.
సంబంధత వార్తలు
ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్‌కు విజయశాంతి సవాల్
కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు
వైఎస్ సెంటిమెంట్‌కు తిలోదకాలు: నైరుతిని నమ్ముకొన్న కాంగ్రెస్
ఆలంపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం
శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం
