శక్తి పీఠం ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు ప్రచారాన్ని ప్రారంబించారు.  

ఆలంపూర్: శక్తి పీఠం ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు ప్రచారాన్ని ప్రారంబించారు. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణరాష్ట్ర ఇంచార్జీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సహా పలువురు నేతలు ఆలంపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైద్రాబాద్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలంపూర్‌కు చేరుకొన్నారు. ఆలంపూర్‌ ఆలయంలో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రచారాన్ని ప్రారంభించారు.

గద్వాల జిల్లాలోని ఆలంపూర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ద్వారా రాజకీయంగా తమకు మంచి ఫలితం వస్తోందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఆలంపూర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.

అయిజ, శాంతినగర్ లలో కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్‌షో‌ల్లో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు గద్వాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. కేసీఆర్ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టనున్నారు.

సంబంధిత వార్తలు

శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం

ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు