ఆలంపూర్ వద్ద గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల ప్రచారసభలో ఆ పార్టీ నేతలు జానారెడ్డి, డీకె అరుణ, విజయశాంతి కత్తి విన్యాసాలు చేసి అందరిని అబ్బుపర్చారు. 


ఆలంపూర్: ఆలంపూర్ వద్ద గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసభలో ఆ పార్టీ నేతలు జానారెడ్డి, డీకె అరుణ, విజయశాంతి కత్తి విన్యాసాలు చేసి అందరిని అబ్బుపర్చారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఆలంపూర్‌లో ప్రారంభించారు.ఈ ప్రచారం సందర్భంగా కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బహుకరించిన కత్తితో ఆ పార్టీ అగ్రనేతలు విన్యాసాలు చేసి ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు.

కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఓబెదుల్లా కొత్వాల్ ఓ కత్తిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఇచ్చారు. మాజీ మంత్రలు జానారెడ్డి, డీకె అరుణ, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతిలు కత్తితో పార్టీ కార్యకర్తలను అబ్బుపర్చేలా విన్యాసాలు చేశారు.

విజయశాంతి సినిమాలో చేసినట్టుగా కత్తితో విన్యాసాలు చేయడంతో పార్టీ కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఇక జానారెడ్డి కత్తిని ముందుకు దూశారు. యుద్దంలో శత్రువులపై కత్తి దూసినట్టుగా జానారెడ్డి కత్తి దూసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక గద్వాల జేజమ్మగా పేరొందిన మాజీ మంత్రి డికె అరుణ కూడ విజయశాంతి తరహలోనే కత్తితో విన్యాసాలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కత్తితో చేసిన విన్యాసాలు ఆ పార్టీ నేతల్లో ఉత్సాహన్ని నింపాయి. మొత్తంగా ఈ విన్యాసాల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

వైఎస్ సెంటిమెంట్‌కు తిలోదకాలు: నైరుతిని నమ్ముకొన్న కాంగ్రెస్

ఆలంపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం

శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం

ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు