Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ సెంటిమెంట్‌కు తిలోదకాలు: నైరుతిని నమ్ముకొన్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ పార్టీ  సెంటిమెంట్‌లో కూడ మార్పు వచ్చింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  చేవేళ్ల నుండి  తన కార్యక్రమాలను ప్రారంభించేది

Telangana congress believes on south west sentiment
Author
Alampur, First Published Oct 4, 2018, 3:06 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ పార్టీ  సెంటిమెంట్‌లో కూడ మార్పు వచ్చింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  చేవేళ్ల నుండి  తన కార్యక్రమాలను ప్రారంభించేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవేళ్ల నుండి ప్రారంభించిన ప్రతి కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలంపూర్ సెంటిమెంట్‌ను నమ్ముకొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్  రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో  పాదయాత్రను ప్రారంభించారు. ఆ సమయంలో చేవేళ్ల నుండి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  పాదయాత్రను చేవేళ్ల నుండి  వైఎస్ఆర్ ప్రారంభించారు.ఈ పాదయాత్ర  విజయవంతమైంది. 2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడానికి  ఈ పాదయాత్ర దోహదం చేసింది.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న  కాలంలో  ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా  చేవేళ్ల నుండి ప్రారంభించడం ఆనవాయితీగా చేసుకొన్నారు. వైఎస్ఆర్ చేవేళ్ల సెంటిమెంట్ కలిసొచ్చిందని ఆ పార్టీ నేతలు నమ్ముతారు.  అందుకే సబితా ఇంద్రారెడ్డిని చేవేళ్ల చెల్లెమ్మగా మారిపోయింది.

ఆ తర్వాత 2009 ఎన్నికల ప్రచారాన్ని కూడ చేవేళ్ల నుండి వైఎస్ఆర్ ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కూడ  కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో దఫా  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత  రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించాలని వైఎస్ తలపెట్టారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ సీఎం వైఎస్ఆర్ నల్లమల అడవుల్లో మృతి చెందారు.

రచ్చబండ కార్యక్రమం చేవేళ్లలో ప్రారంభిస్తే ఈ అనర్థం జరగకపోయి ఉండేదేమో అని అప్పట్లో వైఎస్ సన్నిహితులు అనుకొనేవారు. ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు  రాష్ట్రంలో చోటుచేసుకొన్నాయి. 2014 ఎన్నికల ముందే పార్లమెంట్ ఏపీ పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 

అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా కూడ  కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 2014లో రాజకీయంగా ప్రయోజనం కలగలేదు. టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఈ తరుణంలో గద్వాల జిల్లాలోని  జోగులాంబ ఆలయం నుండి  గురువారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు  ప్రచారాన్ని ప్రారంభించారు.  ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కల్గిస్తోందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.

ఆలంపూర్‌లోని జోగులాంబ ఆలయం ఐదో శక్తిపీఠం. ఈ  ప్రాంతం తెలంగాణకు సౌత్ వెస్ట్‌లో ఉంటుంది. వాస్తుపరంగా మంచిది. అంతేకాదు ఈ ఆలయంలో అమ్మవారిని కోరుకొన్న కోర్కెలు కోరుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం చాలా మంది నేతలు ఈ ఆలయంలో మొక్కుకొన్నారని కూడ స్థానికులు చెబుతుంటారు.

ఈ తరుణంలోనే  వాస్తుపరంగా  కలిసొచ్చిన ఈ ఆలయం నుండి ప్రచారం ప్రారంభిస్తే  రాజకీయంగా తమకు మంచి ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో జోగులాంబ ఆలయం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

సంబంధిత వార్తలు

ఆలంపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం

శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం

ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

 

Follow Us:
Download App:
  • android
  • ios