Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు చెక్:సీఎల్పీ ప్లాన్ ఇదీ

తెలంగాణ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు  కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం రంగం సిద్దం చేస్తోంది. ఒక్కో  ఎమ్మెల్యే కొన్ని సబ్జెక్టులను అప్పగించారు

Congress MLAS Plans to visit in Telangana state
Author
Hyderabad, First Published Mar 6, 2020, 4:35 PM IST


హైదరాబాద్: తెలంగాణ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు  కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం రంగం సిద్దం చేస్తోంది. ఒక్కో  ఎమ్మెల్యే కొన్ని సబ్జెక్టులను అప్పగించారు.  తమకు కేటాయించిన అంశాలపై ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టనున్నారు.

Also read:ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం: అవసరమైతే అసెంబ్లీ పొడిగింపు

అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం నాడు సీఎల్పీ కార్యాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో  అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే విషయమై చర్చించారు.

Also Read:సీఆర్ దార్శనికతతో పురోభివృద్ధిలో తెలంగాణ: తమిళిసై

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని సమావేశం తీర్మానించింది.  విద్య, వైద్యం, గిరిజన సంక్షేమంపై పోడెం వీరయ్య, సీతక్య, , నిరుద్యోగం, ప్రభుత్వ విధానాలపై మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై జగ్గారెడ్డి, మున్సిపల్, ఇరిగేషన్, హైద్రాబాద్‌లో పబ్‌ల అంశంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత  రాష్ట్రంలో పర్యటించాలని  సీఎల్పీ నిర్ణయం తీసుకొంది. అసెంబ్లీలో తాము లేవనెత్తే అంశాలను ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో  విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఆరుగురు ఎమ్మెల్యేలు కూడ కలిసి ఒకే నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నెలకు ఒక్క నియోజకవర్గంలో పర్యటించాలని సీఎల్పీ నిర్ణయం తీసుకొంది.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేయాలని సీఎల్పీ అభిప్రాయపడింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios