తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ప్రధాని మోదీతోనూ, ఎన్డీఏ ప్రభుత్వంతోనూ సత్సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందువల్లే టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ్య డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థికి ఓటేశారని అన్నారు. అయితే కేసీఆర్ కు ప్రధాని మోదీకి మద్య సంధానకర్తగా ప్రముఖ వ్యాపారవేత్త ఆదానీ వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ సంచలన  వ్యాఖ్యలు చేశారు.

ఇందుకోసం ఆదానీ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహయసహకారాలు అందిస్తున్నారన్నారు. చత్తీస్ ఘడ్ లోని మార్వా విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఆదానీ కంపనీ బొగ్గును ఉత్పత్తి చేస్తోందని అందువల్లే అక్కడి నుండే కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేసుండకపోతే ఆదానీ గ్రూప్ దివాల తీసేదని రేవంత్ తెలిపారు. ఇలా లబ్ధి చేకూరుస్తున్నాడు కాబట్టే మొన్న కరుణానిధిని పార్థీవ దేహాన్ని చూడటానికి కేసీఆర్ వెళ్లడానికి ఆదానీ తన సొంత విమానాన్ని ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇవాళ జరిగిన రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో బిజెపికి టీఆర్ఎస్ మద్దతివ్వడం ఒప్పందం ప్రకారమే జరిగిందన్నారు. ఇలా ముస్లీం రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్న పార్టీతో ఎంఐఎం మద్దతు ఎందుకిస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు.  

మరిన్ని వార్తల కోసవ కింది లింక్ లపై క్లిక్ చేయండి

ఆపరేషన్ కొడంగల్: టార్గెట్ రేవంత్ రెడ్డి, హరీష్ వ్యూహం ఇదీ...

తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తొంది...కానీ ఆ కుటుంబం అంబానీల్లా మారుతున్నారు : రేవంత్ రెడ్డి

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి