Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తొంది...కానీ ఆ కుటుంబం అంబానీల్లా మారుతున్నారు : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలకు పాల్పడుతుందంటూ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ నాయకుడు సీఎం కేసీఆర్ ను అపరభగీరథుడని చెప్పుకునే నాయకులు ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం రోజురోజుకు తమ ఆస్తులను పెంచేకుంటూ అంబానీల్లా మారుతుంటే, ధనిక రాష్ట్రం తెలంగాణ మాత్రం దివాళ తీస్తోందని రేవంత్ ఎద్దేవా చేశారు. 

congress leader revanth reddy fires on telangana government

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్లో అవకతవకలకు పాల్పడుతుందంటూ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ నాయకుడు సీఎం కేసీఆర్ ను అపరభగీరథుడని చెప్పుకునే నాయకులు ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని అన్నారు. కేసీఆర్ కుటుంబం రోజురోజుకు తమ ఆస్తులను పెంచేకుంటూ అంబానీల్లా మారుతుంటే, ధనిక రాష్ట్రం తెలంగాణ మాత్రం దివాళ తీస్తోందని రేవంత్ ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందన్నారు.  వారి అవినీతికి  సంబంధించి అన్ని ఆధారాలున్నాయనీ, అవసరం వచ్చినప్పుడు వాటిని బైటపెడతామని అన్నారు.  మరికొద్ది రోజులైతే ప్రభుత్వం ఉండదనే ఉద్దేశ్యంతో మరింత అవినీతి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న గోదావరి, కృష్ణా నదీ జలాలపై కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. వాటిలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని బైటపెట్టడానికే ఇప్పుడు తాను మాట్లాడుతున్నానని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చేపడుతన్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అవకతవకల గురించి రేవంత్ వివరించారు.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేర్లతో తలపెట్టిన ప్రాజెక్టులను కలిపి టీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన రెండేళ్లకు అంటే 2016 జీవో నెంబర్ 11 ద్వారా రూ.7,926 కోట్లతో 50 టీఎంసీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు
నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలన అనుమతులిచ్చిందని గుర్తు చేశారు. 

అయితే తాజాగా నిన్న గురువారం రోజున ఈ ప్రాజెక్టు వ్యయాన్ని అమాంతం పెంచుతూ జీవో నెంబర్ 72 విడుదల చేశారని అన్నారు. అంచనా వ్యయాన్ని అమాంతం రూ.1357 కోట్లకు పెంచి కాంట్రాక్టర్లు లబ్ది చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో ఐదు వేల రెండు వందల కోట్లు పెంచడం ఏంటని ప్రశ్నించారు. అంతే కాకుండా మొదటి జీవోలో 5 లక్షల ఎకరాలకు నీరందిస్తామని చెప్పి ఇప్పుడు 3 లక్షల ఎకరాలకు అందిస్తామంటున్నారని జీవో పేర్కొన్నారని మండిపడ్డారు. వీరు తీసుకున్న నిర్ణయాలను వీరు మారుస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ మండిపడ్డారు.

చీప్ మినిస్టర్ కంటే చీఫ్ ఇంజనీర్ గానే ఎక్కువ పనిచేశానని చెప్పుకునే సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీష్ రావు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఎవరి ధన దాహం తీర్చడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం ఉండదు కాబట్టి అందిన కాడికి దోచుకోడానికి ఇలా చేస్తున్నారని రేవంత్ విమర్శించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios