Asianet News TeluguAsianet News Telugu

అమృతను పరామర్శించి, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన జానారెడ్డి

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువుహత్య బాధితులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి పరామర్షించారు. మిర్యాలగూడ పట్టణంలోని మృతుడు ప్రణయ్ నివాసానికి చేరుకున్న జానారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. ముఖ్యంగా ప్రణయ్ భార్య అమృతను దగ్గర కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పారు. అమృతకు, కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని జానారెడ్డి హామీ ఇచ్చారు. 
 

congress leader Jana Reddy consoles Pranay Family members
Author
Miryalaguda, First Published Sep 17, 2018, 2:55 PM IST

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువుహత్య బాధితులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి పరామర్శించారు. మిర్యాలగూడ పట్టణంలోని మృతుడు ప్రణయ్ నివాసానికి చేరుకున్న జానారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. ముఖ్యంగా ప్రణయ్ భార్య అమృతను దగ్గర కూర్చోబెట్టుకుని ధైర్యం చెప్పారు. అమృతకు, కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని జానారెడ్డి హామీ ఇచ్చారు. 

ఇక ఈ పరువుహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకుడు కరీంను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారు. ఈ హత్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న కరీంను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి  మారుతిరావుతో పాటు అతడి సోదరుడు శ్రవణ్ ను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నిందితుల నుండి సుపారీ తీసుకున్నమాజీ ఉగ్రవాది బారీ...షపీ అనే రౌడీ చేత ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం ఈ సుపారీ హంతకుల కోసం పోలీసుల వేట  కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య.. అమృత తండ్రికి ఉరిశిక్ష...? సుప్రీం ఏం చెప్పింది..?

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: వేముల వీరేశంపై అమృత సంచలన ఆరోపణలు

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios