శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం.. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్‌లో గందరగోళం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ల్యాండింగ్‌లో గందరగోళం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై ల్యాండ్ అవుతూనే.. పైలెట్ ఒక్కసారిగా విమానాన్ని టేకాఫ్ చేశారు. దీంతో ఏం జరుగుతుందోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఆ తర్వాత ఐదు నిమిషాలకు పైలెట్.. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రన్‌వేపై విజిబిలిటీ సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.