రైతుగా మారిన కలెక్టర్.. పొలంలో దిగి వరి నాట్లు వేసిన ముజమ్మిల్ ఖాన్..

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రైతులతో కలిసి పొలంలో దిగి పని చేశారు. వారితో కలిసి వరి నాట్లు వేశారు (Pedpadalli collector Muzammil Khan planted paddy). వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Collector turned farmer.. Muzammil Khan planted paddy in the field..ISR

Muzammil Khan : ఆయన ఓ జిల్లాకు కలెక్టర్. ఎప్పుడూ అధికారులతో సమావేశాలు, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ పనుల్లో బిజీగా ఉండే ఆయన రైతుగా మారారు. పొలంలోని బురదలోకి దిగి వరి నాట్లు వేశారు. రైతులతో ప్రేమగా మాట్లాడారు. వారికి ఎదురువుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

రాజాసింగ్ ను విద్వేషపూరిత ప్రసంగాలు చేయనివ్వద్దు - సుప్రీంకోర్టు

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం చందపల్లి గ్రామానికి వచ్చారు. అక్కడి రైతుల పొలాను పరిశీలించారు. సాగు పద్ధతులను పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా పొలంలోకి దిగి రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. దీంతో అక్కడున్న రైతులు సంతోషించారు. 

తెలంగాణ ప్రజల బలమైన గొంతుక బీఆర్‌ఎస్ మాత్రమే - కేటీఆర్

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో నారుమడి వేసిన దగ్గర నుంచి రైతులు పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలో అందుబాటులో ఉంటూ వారికి సలహాలు సూచనలు అందజేయాలని, రైతులు అధిక లాభం పొందే విధంగా సంబంధిత అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. నాట్లు వేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది.. పంటకు రోగాలు వస్తే వాడాల్సిన పురుగు మందులు, ఎరువుల లభ్యత, పంట దిగుబడి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం మిల్లులకు తరలింపు రైతులకు జరిగే చెల్లింపు తదితర అంశాలలో రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ చైనా ఊరికే ఉండదుగా.. మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు.. 100 శాతం మరణాల రేటట..

నూతన సాగు పద్ధతులను రైతులకు వివరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే విధంగా రైతులకు సూచనలు ఇవ్వాలని వివరించారు. పంట కొనుగోలు సమయంలో వరి ధాన్యం తరుగు గురికాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios