Top Stories: ఉచిత విద్యుత్‌ కోసం సీఎం ఆదేశాలు, అయోధ్యకు కాంగ్రెస్ డుమ్మా, చలాన్ల గడువు పొడిగింపు

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. కొత్త రాష్ట్రం తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. గృహలక్షీ పథకంపైనా చర్చలు జరిగాయి. ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకాబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
 

cm revanth reddy revies power dept, asks officials to furnish all details, congress not goint ayodhya, pending traffic challans last date postponed in todays top stories kms

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుధవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో సమావేశం జరిగింది. సుదీర్ఘంగా సమీక్షా సమావేశం జరిగింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం)ల మధ్య పెట్టుకున్న సంబంధాలు, వాటి వెనుక కారణాలను సమగ్రంగా అధ్యయనం చేసి వివరించాలని సీఎం ఆదేశించారు. ఒక వేళ ఎక్కువ కారణాలతో విద్యుత్ కొనుగోలు చేస్తే అందుకు కారణాలనూ తెలియజేయాలని పేర్కొన్నారు. శాసన సభలో రాజకీయ పార్టీల సమ్మతంతో కొత్త విద్యుత్ విధానం తెస్తామని తెలిపారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు కావాల్సిన అవసరాలను పరిశీలించాలని వివరించారు. గృహలక్ష్మీ కింద ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరాపైనా సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

కాంగ్రెస్ డుమ్మా

ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరికి ఆహ్వానాలు అందాయి. అయితే, రామ మందిర ప్రారంభ కార్యక్రమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ ప్రాజెక్టుగా మార్చిందని, ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇంకా నిర్మాణం పూర్తికాని రామ మందిరాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. 2019 సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ, భక్తుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ తమకు వచ్చిన ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్టు మరో సీనియర్ లీడర్ జైరాం రమేశ్ వెల్లడించారు.

Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రవాణ మంత్రి పొన్నం ఆదేశాలు

ట్రాఫిక్ చలాన్లు 31 వరకు

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈ రాయితీకి అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 3.56 కోట్లల్లో 1.05 చలాన్లు మాత్రమే చెల్లించారు. ఇంకా పెద్దమొత్తంలో పెండింగ్‌లో ఉండటంతో గడువును ఈ నెలాఖరుకు పొడిగించింది. ఆటోలకు 80 శాతం, ఆర్టీసీకి 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం డిస్కౌంట్‌ను కల్పించింది.

Also Read: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలకలం.. 11.14 క్వింటాళ్లు స్వాధీనం.. అందులో ఏం కలిపారంటే?

టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదం

టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ సౌందరరాజన్ ఆమోదించారు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను కూడా ఆమోదించారు. అలాగే, ప్రశ్న పత్రాల లీకేజీలో సిట్ దర్యాప్తు కొనసాగించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.  ఈ సమయంలోనే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ కోసం ఇప్పటికే అన్వేషణ ప్రారంభమైందని, బోర్డు సభ్యుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

Also Read: AP News: ‘ఆడదాం ఆంధ్రా’లో.. కొట్టుకున్న విద్యార్థులు.. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రసాభాసగా పోటీలు

ఉద్ధవ్ ఠాక్రేకు షాక్

మహారాష్ట్రలో మహావికాస్ అఘాదీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన శివసేన చీలికపై స్పీకర్ నర్వేకర్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాక్ ఇచ్చారు. శిండే వర్గమే అసలైన శివసేన వివరించారు. ఏక్‌నాథ్ శిండే వెంటే పార్టీలోని అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన తెలిపారు. అందువల్లే శాసన సభా పక్ష నేతను తొలగించే అధికారం ఉద్ధవ్ ఠాక్రేకు ఉండదని స్పీకర్ స్పష్టం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios