TSRTC: తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రవాణ మంత్రి పొన్నం ఆదేశాలు

తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 813 మందిని కారుణ్య నియామకాల కింద రిక్రైట్ చేసుకుంటున్నట్టు తెలిపింది.
 

telangana govt to recuirt compassionate appointments kms

Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో కండక్టర్ కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి నిర్వహణలో మరణించిన కండక్టర్ల వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ ఉద్యోగాలను ఇవ్వాలని ఆర్టీసీ అధికారులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కారుణ్య నియామకాల కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 813 మందిని కండక్టర్లుగా నియమించుకోవడానికి సిద్ధం అవుతున్నది. విధి నిర్వహణలో మరణించిన కండక్టర్ల జీవిత భాగస్వామి లేదా వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి కసరత్తు చేయాలని, వారి విద్యార్హతల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Also Read: TSRTC: సంక్రాంతికి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించిన ఆర్టీసీ.. కారణాన్ని వెల్లడించిన సజ్జనార్

హైదరాబాద్‌లో 66 మందిని, రంగారెడ్డిలో 52 మందిని, నల్గొండలో 56 మందిని, కరీంనగర్‌లో 45 మందిని, నిజామాబాద్‌లో 69 మందిని, ఆదిలాబాద్‌లో 71 మందిని, ఖమ్మంలో 53 మందిని, వరంగల్‌లో 99 మందిని, మెదక్‌లో 93 మందిని, మహబూబ్ నగర్‌లో 83 మందిని రీజియన్ల వారీగా రిక్రూట్ చేసుకోనుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కారుణ్య నియామకాల కోసం కోసం కొన్ని ఏళ్లుగా పడిగాపులు గాస్తున్న కుటుంబాలకు ఈ వార్త ఊరట కలిగించనుందని వివరించారు. వారి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios